S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/21/2015 - 13:55

తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చేస్తున్నారు. 24 గంటల ముందే భక్తులను క్యూలోకి అనుమతించిన టీటీడీ అన్ని మౌలిక వసతులు కల్పించింది. ఈరోజు స్వామివారిని రికార్టుస్థాయిలో భక్తులు దర్శించుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.

12/21/2015 - 11:54

హైదరాబాద్: ఎ.పి. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైకాపా నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి బయటకు వెళ్లిపోయిన తరువాత వైకాపా ఎమ్మెల్యేలు ఈ విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే అంశంపై రేపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

12/21/2015 - 11:53

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం స్వామివారిని స్వర్ణ రథంపై తిరువీధుల్లో ఊరేగిస్తుండగా భక్తుల రద్దీ అధికమై స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప మెట్లపై ఎక్కిన భక్తులు కిందికి జారి పడ్డారు. దీంతో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

12/21/2015 - 11:53

తిరుపతి: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఎ.పి.లోని తిరుమల, ఒంటిమిట్ట, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, తెలంగాణలో యాదాద్రి, భద్రచలం, వేములవాడ తదితర ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. తిరుమలలో స్వామివారు ఈ రోజు ఉదయం స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

12/21/2015 - 11:52

విశాఖ: జి.మాడుగుల మండలం మడవకొండ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించి, ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడన్న అభియోగంపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే సోమవారం ఉదయం పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.

12/21/2015 - 11:52

హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్‌ను ఎత్తివేయక పోవడం, కాల్‌మనీ వ్యవహారంపై చర్చ చేపట్టక పోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ వైకాపా ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శీతాకాల సమావేశాలకు తాము హాజరయ్యే ప్రసక్తి లేదని విపక్ష నాయకులు వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు.

12/19/2015 - 14:25

తిరుమల: తిరుమల మొదటి కనుమ రహదారిలోని 35వ మలుపు వద్ద శనివారం వ్యాన్ లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ విషయాన్ని గమనించిన భక్తులు వాహనంలో నుంచి కిందకి దూకేశారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.

12/19/2015 - 14:08

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ను మెడికల్‌ హబ్‌గా తయారు చేయాలనేదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ శంకస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... వైద్య సేవలకు అమరావతి కేంద్రంగా తయారుకాబోతుందన్నారు.

12/18/2015 - 13:48

ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం మండలం నిక్కంటి దగ్గర నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్‌ను పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఈ డంప్‌లో భారీగా లాంచర్లు, గన్‌లు, బుల్లెట్లు లభ్యమైనట్లు తెలుస్తుంది.

12/18/2015 - 07:55

సిపిఎం నేత ప్రకాష్ కారత్ డిమాండ్

Pages