S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/03/2016 - 07:22

పాడేరు, జూన్ 2: విశాఖ జిల్లా పాడేరు మండలం మినుములూరు వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటనలో పద్నాలుగు మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న పాడేరు డిపోకు చెందిన బస్సు మినుములూరు గ్రామం వద్ద మలుపులో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లో బోల్తా పడింది.

06/03/2016 - 07:21

హైదరాబాద్, జూన్ 2: తాత్కాలిక రాజధానికి తరలి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయని ఎపి ఉద్యోగులు కొందరు గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో చెప్పారు. అమరావతి వెళ్లేందుకు ఇష్టపడని ఎపి ఉద్యోగులు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరిని , బిజెపి ప్రధాన అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్లను కలిసి ఐదు పేజీల వినతి పత్రం ఇచ్చారు.

06/03/2016 - 07:21

విజయవాడ, జూన్ 2: రాజధాని ప్రాంత అభివృద్ధి అధారిటీ (సిఆర్‌డిఏ) అధికారులతో కంబోడియా రాయబారి నవీన్ శ్రీవాత్సవ, ఉగాండాలోని భారత హై కమిషనర్ ఎవిఎస్ రమేష్‌చంద్ర గురువారం సమావేశమయ్యారు. రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక, భూ సమీకరణ విధానం, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. అలాగే ఇక్కడ ఉపాధి అవకాశాలపై కూడా సిఆర్‌డిఏ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

06/03/2016 - 07:20

విశాఖపట్నం, జూన్ 2: రాష్ట్ర విభజన తరువాత ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యాపారాన్ని పెంచుకుంటూ ఆదాయ లక్ష్యాలను సాధించడంలో గిరిజన సహకార సంస్థ (జిసిసి) ప్రత్యేకతను చాటుకుంటోంది. కేవలం అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారానే ఏడాదికి ఆర్జించే రూ.250 కోట్లతో సరిపెట్టకుండా అనేక రకాలైన వ్యాపారాలతో ఆర్థిక ప్రగతిని సాధించగలుగుతోంది.

06/03/2016 - 07:17

రాజమహేంద్రవరం, జూన్ 2: ప్రభుత్వంలోని కాపు సామాజికవర్గానికి చెందిన కొందరు పెద్దలతో చేయిస్తున్న విమర్శలు, అరెస్టులు జరుగుతాయనే బెదిరింపులకు భయపడి తమ ఉద్యమాన్ని విరమించేది లేదని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టంచేశారు. కాపులను బిసిల్లో చేరుస్తానని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే హామీ ఇచ్చినందున, దాన్ని నెరవేరుస్తారో, మళ్లీ రోడ్డెక్కమంటారో ఆయనపైనే ఆధారపడివుందన్నారు.

06/03/2016 - 07:17

కర్నూలు, జూన్ 2 : తెలుగుదేశం పార్టీని భుజాల మీద పెట్టుకుని మోస్తున్న బిసిలను చిన్న చూపు చూస్తున్నారు, పార్టీ మారిన వారికి, డబ్బులున్న వారికి పదవులు ఇస్తున్నారు ఇది మంచి సంప్రదాయం కాదని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి సోదరుడైన మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

06/03/2016 - 07:15

తిరుపతి, జూన్ 2: ఎస్వీ యూనివర్శిటీ గత నెల 23న రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 27 సెంటర్లలో నిర్వహించిన ఎపి ఎడ్‌సెట్- 2016 పరీక్షల్లో స్ర్తి,పురుష అభ్యర్థులు పోటాపోటీగా ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 96.36శాతం ఉత్తీరణ సాధించగా మహిళలు 96.06శాతం ఉత్తీర్ణత సాధించారు. గురువారం ఎస్వీయూ విసి చాంబర్‌లో విసి ఆవుల దామోదరం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.

06/03/2016 - 07:13

కాకినాడ, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజన్ 2020 డాక్యుమెంట్ కింద అభివృద్ధిచేసి అతి త్వరలో దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విభజన నష్టాలను, సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడం ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

06/03/2016 - 07:12

మడకశిర, జూన్ 2 : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో దోషులు, ఆర్థిక నేరస్థులను పార్టీలోకి చేర్చుకుని వారితో డబ్బులు దండుకుని ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని, ప్రస్తుతం రాజ్యసభ సీట్లను కూడా అదే తరహాలో డబ్బు తీసుకుని ఇచ్చారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు.

06/03/2016 - 07:12

విశాఖపట్నం, జూన్ 2: మాజీ ఎమ్మెల్యే, ఎపి పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌పై పెందుర్తి పోలీసులు భూ ఆక్రమణ కేసు గురువారం నమోదు చేశారు. స్థానిక లక్ష్మీపురం గ్రామంలో ఒక దగ్గర సుమారు పదకొండు సెంట్లు స్థలం ఉంది. ఈ స్థలంలోకి గురువారం ద్రోణంరాజు శ్రీనివాస్ తన అనుచరులతో వెళ్లి మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు.

Pages