S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/03/2016 - 07:11

గుంటూరు, జూన్ 2: గుంటూరు నగరంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టితో ఈదురుగాలులు వీయడంతో పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. నగరంలో 200కు పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. బాపట్లలో చెత్తను తొలగిస్తున్న ఓ అవుట్‌సోర్సింగ్ కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.

06/03/2016 - 07:11

విజయపురిసౌత్, జూన్ 2: నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రానికి 506.2 అడుగులకు చేరుకుంది. ఇది 125.8 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది.

06/03/2016 - 07:10

రావికమతం, జూన్ 2: విశాఖ జిల్లా రావికమతం మండలం గుడ్డిపలో గురువారం పశువులను చెరువులో కడుగుతూ ఇద్దరు అనుకోని రీతిలో మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి ఇందలి సతీష్(11), పాల సేకరణ కేంద్రంలో సహాయకుడిగా పని చేస్తున్న గల్లా శ్రీను(33) ఈ ప్రమాదంలో మరణించారు.

06/03/2016 - 07:10

విజయనగరం,జూన్ 2: విజయనగరం మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సిహెచ్‌వి నారాయణరావు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. పట్టణానికి చెందిన మురళి అనే బిల్డర్ జి- ప్లస్ 4 భవన నిర్మాణానికి సంబంధించి విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నుంచి అనుమతులు పొందారు.

06/02/2016 - 08:12

గుంటూరు, జూన్ 1: సమైక్యాంధ్ర ఉద్యమంలో రైల్‌రోకో నిర్వహించిన కేసులో రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మరికొందరికి రైల్వేకోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్‌లు జారీచేసింది. 2014లో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను అఖిలపక్షం ఆధ్వర్యంలో అడ్డగించి ఆందోళన నిర్వహించారు. దీనిపై అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

06/02/2016 - 08:11

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 1: ప్రతి పాఠశాల ప్రార్థనాలయం కావాలని, పుట్టుకతో ఏదీ సాధ్యం కాదని, సాధనతో ఏదైనా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడలో డిఎస్సీ 2014 ద్వారా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు అందజేసి, ప్రతిజ్ఞ చేయించారు.

06/02/2016 - 08:11

విజయవాడ, జూన్ 1: ప్రజలు తమపట్ల కనబరచిన నమ్మకాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిలబెట్టుకుందని బిజెపి మహిళా మోర్ఛా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ, రెండేళ్ల పాలన పూర్తి చేసిన ఎన్‌డిఎ ప్రభుత్వం తను ప్రజలకోసం చేసిన పనులు, కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజలకు సవివరంగా వివరించనున్నామని పేర్కొన్నారు.

06/02/2016 - 07:26

విజయవాడ, జూన్ 1: రాష్ట్ర విభజన దినాన్ని ఎపి ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షగా పరిగణించి, ఈ సందర్భంగా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో ప్రతిజ్ఞా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయి నవ నిర్మాణ దీక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నిర్వహించనున్నారు.

06/02/2016 - 07:47

విజయవాడ, జూన్ 1: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను ఈనెల 10 నుంచి 20వ తేదీల మధ్య జరపాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే విడుదల చేయాలని బుధవారం సిఎం క్యాంపుకార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

06/02/2016 - 07:22

హైదరాబాద్ జూన్ 1: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు మళ్లీ పరీక్ష ఎదురుకానుంది. మంత్రుల పనితీరు, సామర్థ్యం, ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న తీరుపై గతంలో సర్వేలు నిర్వహించి, ర్యాంకులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ మరో సర్వే చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది.

Pages