S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/02/2016 - 07:22

విజయవాడ, జూన్ 1: ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వైసిపి ఎమ్మెల్యే ముత్తంశెట్టి అశోక్‌రెడ్డిని చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒకవైపు వౌలికవసతులు లేక మరోవైపు రాజధాని లేక అష్టకష్టాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ త్వరలోనే కష్టాలను అధిగమించి పురోభివృద్ధి సాధించడం తథ్యమని పేర్కొన్నారు.

06/02/2016 - 06:32

హైదరాబాద్, జూన్ 1: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు అటు తిరిగి కులం రంగు అంటుకుంది. కేంద్రమంత్రి సుజనా చౌదరి, టిజి వెంకటేష్‌ను ఎంపిక చేయటం ఇంటా, బయట ఇతర కులాలకు అసంతృప్తిగా మారింది. పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలను టిడిపి మోసం చేసిందని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన ఆర్.

06/02/2016 - 06:26

తిరుపతి, జూన్ 1: ఆంగ్ల భాష జోరందుకుంటున్న నేటి సమాజంలో తెలుగు నేర్చుకోవాలంటేనే తాము తక్కువ వారేమో అని భావిస్తున్న అనేకమంది కళ్లు తెరిపించేలా నాలుగేళ్ల వయసున్న వంద మంది చిన్నారులు 10 నిమిషాల్లో వంద వేమన పద్యాలను శ్రావ్యమైన కంఠంతో అలవోకగా వల్లిం చి అందరినీ విస్మయపరిచారు. ఏకకాలంలో మూడు రికార్డులను బద్దలు కొట్టారు. తిరుపతిలో మేక్ మై బేబీ జీనియస్ పాఠశాల విద్యార్థులు ఈ ఘనత సాధించారు.

06/01/2016 - 18:08

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ఈ నెల 2న ఉస్మానియా వర్సిటీలో జరిగే జనజాతర సభకు టి.టిడిపి నేత రేవంత్‌రెడ్డిని అనుమతించరాదంటూ ఓయు విద్యార్థి జెఎసి రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఓయులోకి రేవంత్ వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నందున పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలని జెఎసి కోరింది.

06/01/2016 - 18:07

శ్రీకాకుళం: ఇక్కడికి సమీపంలోని ఎచ్చెర్ల పోలీస్ శిక్షణ కేంద్రంలో బుధవారం ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ తీగ తగిలి ఆదినారాయణ అనే ఎఆర్ కానిస్టేబుల్ మరణించాడు. ఇదే ఘటనలో గాయపడిన మరో కానిస్టేబుల్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. కానిస్టేబుల్ మరణంతో ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్‌లో విషాదం అలముకుంది.

06/01/2016 - 16:36

విజయవాడ: ఈ నెల 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నవనిర్మాణ దీక్ష కార్యక్రమం పూర్తయ్యాక 8వ తేదీన ఒంగోలులో మహాసంకల్ప సభను నిర్వహించాలని ఎపి క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతను బుధవారం ఇక్కడ జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

06/01/2016 - 16:35

విజయవాడ: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయిన సందర్భంగా చేపట్టే నవ నిర్మాణ దీక్షలో అన్ని వర్గాల వారూ భాగస్వామ్యం కావాలని ఎపి సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన బుధవారం ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకూ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకూ సదస్సులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

06/01/2016 - 14:29

విజయవాడ: తమను బడికి పంపడానికి బదులు పనుల్లోకి వెళ్లాలంటూ తల్లిదండ్రులు వేధిస్తున్నారని ఇద్దరు చిన్నారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో చిన్నారులైన సిద్ధు (13), రేష్మి (8) తమ తల్లిదండ్రులపైనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం కలిగించింది. బాగా చదువుకొనాలని ఆశ పడుతున్న వీరు బంధువుల సాయంతో పోలీసులను ఆశ్రయించారు.

06/01/2016 - 14:27

గుంటూరు: 2014లో సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా రైల్‌రోకో కేసుకు సంబంధించి ఎపి వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, టిడిపి ఎమ్మెల్యే ఆలపాటి రాజా,మాజీ ఎమ్మెల్యేలు జియావుద్దీన్, ఈశ్వరరావు, వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డిలపై రైల్వే కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లను బుధవారం జారీ చేసింది.

06/01/2016 - 14:26

అనంతపురం: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్‌లు నిర్వహించిన అంతర్రాష్ట్ర ముఠాలోని 25 మందిని ధర్మవరంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 30 తులాల బంగారు నగలు, సుమారు 4 లక్షల నగదు, 4 ఎల్‌ఇడి టీవీలు, 82 సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను బుధవారం స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

Pages