S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/09/2016 - 06:37

తెనాలి, మే 8: సినీ హీరో మహేష్‌బాబు తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో ఆదివారం పర్యటించారు. తాను దత్తత తీసుకున్న ఈ గ్రామంలో 2.16కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మహేష్‌బాబు మాట్లాడుతూ తన తాత, నాయనమ్మ, అమ్మ, నాన్నల స్వగ్రామం తనకు సొంత గ్రామమేనన్నారు.

05/09/2016 - 06:30

రాజమహేంద్రవరం, మే 8: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమని రాష్ట్రం, కాదని పోలవరం అథారిటీ పేర్కొంటున్న నేపధ్యంలో నిధుల కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం మాట ఎలా ఉన్నా నిధుల విడుదలలో స్పష్టత లభిస్తే పనులు మరింత పుంజుకునే అవకాశం ఉంది. పోలవరం పూర్తిగా కేంద్రమే నిర్మిస్తుందని, అవసరమైతే నాబార్డు నిధులు తీసుకుని మరీ నిర్మిస్తామని కేంద్రం ఒకపక్క చెబుతోంది.

05/09/2016 - 06:25

విశాఖపట్నం, మే 8: విశాఖపట్నం ఆర్‌కె బీచ్‌లో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. సెలవుల్లో సందడి చేసేందుకు బీచ్‌కు వచ్చిన వారిలో ఐదుగురు స్నానానికి దిగి అలల తాకిడికి గల్లంతుకాగా, యారాడ బీచ్‌లో మరో వ్యక్తి సముద్రంలో పడి మృత్యువాత పడ్డాడు.

05/09/2016 - 05:33

కాకినాడ, మే 8: ఎపి ఎమ్సెట్-2016 ఫలితాలు సోమవారం సాయంత్రం 5 గంటలకు వెల్లడికానున్నాయి. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయంలో గల ప్లాటినం జూబ్లీ అతిథి గృహంలో ఫలితాలను వెల్లడిస్తారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు సెట్ కమిటీ సమావేశాన్ని విశాఖలోనే నిర్వహిస్తామని ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు.

05/08/2016 - 20:05

కర్నూలు:కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. స్థానిక క్వారీలో మట్టిపెళ్లలు విరిగిపడటంతో మహిళా కార్మికులు మృత్యువాత పడ్డారు. హుస్నాపురం, చండ్రపల్లె గ్రామాలకు చెందిన నారాయణమ్మ, రామక్క, లక్ష్మి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

05/08/2016 - 20:03

విశాఖపట్నం:స్థానిక రామకృష్ణ బీచ్‌లో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సముద్రంలోకి దిగినప్పుడు అలలధాటికి చెల్లాచెదురయ్యారు. గల్లంతయినవారిలో శ్రవణ్, శేషు, ప్రసాద్, బాబు, చైతన్య ఉన్నట్లు తెలిసింది. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

05/08/2016 - 20:03

చిత్తూరు:జిల్లాలోని నిండ్ర మండలం కొప్పేడువద్ద ఆదివారం సాయంత్రం ఓ ఇంట్లోకి కారు దూసుకుపోయిన సంఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నైకు చెందిన కొందరు కైలాసకోన పర్యటనకు వచ్చి తిరుగువెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

05/08/2016 - 16:28

నల్గొండ:జిల్లాలోని రాయినగూడెం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు కన్నుమూశారు. నడిగూడెం గ్రామానికి చెందిన భరత్, కపిల్ ద్విచక్రవాహనంపై వెడుతూండగా లారీ ఢీకొట్టడంతో వారిద్దరూ మరణించారు.

05/08/2016 - 16:28

మహబూబ్‌నగర్:నీటిఎద్దడితో అతలాకతులమవుతున్న మహబూబ్‌నగర్ ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. నారాయణపూర్ ప్రాజెక్టు ద్వారా జూరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కర్నాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎంబి పాటిల్‌ను తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావ్ ఫోన్‌లో కోరారు.

05/08/2016 - 16:27

కర్నూలు:వైకాపాకు చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి ఆదివారంనాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలులో జరిగన నీరు-చెట్టు కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Pages