S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/08/2016 - 16:27

గుంటూరు:గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో సినీనటుడు మహేశ్‌బాబు హల్‌చల్ సృష్టించారు. శ్రీమంతుడు సినిమా విడుదల అనంతరం తన బావ, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ సూచన మేరకు సొంత గ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకున్న మహేశ్‌బాబు తొలిసారిగా బుర్రిపాలెం సందర్శించాడు. గ్రామాభివృద్ధికి సహకరిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. తరచూ గ్రామానికి వస్తూంటానని చెప్పారు.

05/08/2016 - 05:02

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెన్కో విద్యుత్ ఉత్పత్తి స్ధాయిని పెంచడం, విశిష్ట స్ధాయిలో సేవలు అందించినందుకు జెన్కో సిఎండి, సీనియర్ ఐఎఎస్ అధికారి కె విజయానంద్‌కు ప్రతిష్ఠాకరమైన గ్రీన్ టెక్ ఫౌండేషన్ బంగారు పతకం లభించింది. ఈ అవార్డును విజయానంద్ తరఫున జెన్కో చీఫ్ జనరల్ మేనేజర్ ఎం సుజయ్ కుమార్ అందుకున్నారు. అవార్డును కెనరా బ్యాంకు మాజీ సిఎండి నుంచి వీరు అందుకున్నారు.

05/08/2016 - 04:55

హైదరాబాద్, మే 7: నిధుల కోసం కటకటలాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు రోజుగడవడమే కష్టంగా మారింది. ఏ రోజుకారోజు ఆదాయాన్ని లెక్క వేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంనుండి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ముందస్తు ప్రణాళికలు వేసిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు నిధులు అందకపోవడంతో ఇబ్బందుల్లో పడింది. దీనికి తోడు ఆదాయం కూడా అంతంత మాత్రంగా మారింది.

05/08/2016 - 04:54

చిత్తూరు, మే 7: రాష్ట్ర అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాల క్రిష్ణా రెడ్డిని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డ వ్యక్తిని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డిఎస్పి లక్ష్మినాయుడు కథనం మేరకు కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం, తిప్పరాజు పల్లికి చెందిన ఈశ్వర్ రెడ్డి కుమారుడైన జగన్‌రెడ్డి హైదారాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

05/08/2016 - 04:53

హైదరాబాద్, మే 7: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారికి రాష్ట్రప్రభుత్వం క్యాబినెట్ ర్యాంకు కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి శశిభూషన్ కుమార్ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మీదట ఆమె జీత భత్యాలు, ఇతర సౌకర్యాలు క్యాబినెట్ ర్యాంకు మంత్రితో సమానంగా ఉంటాయని పేర్కొన్నారు.

05/08/2016 - 04:50

తిరుమల, మే 7: తిరుమల శేషాచల అడవుల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న కూలీలు అటవీశాఖ బేస్ క్యాంపు, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందిపై తిరగబడి దాడిచేసిన సంఘటన శుక్రవారం అర్ధ రాత్రి జరిగింది. కూలీలు తమ వద్ద ఉన్న కత్తులు, గొడ్డళ్లతో సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వెంటాడటంతో ఎర్రచందనం కూలీలు దుంగలను వదిలి పారిపోయారు. ఈ సందర్భంగా వారు వదిలివెళ్లిన రూ.

05/08/2016 - 02:37

కడప/కర్నూలు, మే 7: రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కడప మున్సిపల్ మైదానంలో శనివారం ఉద్యాన రైతులకు రుణ విమోచన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కర్నూలు నగరంలో నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

05/08/2016 - 02:31

రాజమహేంద్రవరం, మే 7: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పంచాయితీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జి దుర్గాప్రసాదరావు ఇంటిపైనా, కార్యాలయంపైనా అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం దాడిచేసి సోదా చేశారు. ఎసిబి డిఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని వచ్చిన ఫిర్యాదుతో ఈ తనిఖీలు నిర్వహించారు.

05/08/2016 - 02:29

ఒంగోలు,మే 7: ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కనిగిరి మాజీ శాసనసభ్యుడు ముక్కు ఉగ్రనరసింహరెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నారు. ఈమేరకు తన రాజకీయ భవిష్యత్తు వ్యూహంపై అనుచరులతో కనిగిరిలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ మేరకు తన అనుచరులకు వర్తమానం అందింది. తన అనుచరులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈసమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

05/08/2016 - 02:28

నెల్లూరు, మే 7: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపల్ పాఠశాలలను ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చునున్నట్లు రాష్ట్ర మునిసిపల్‌శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

Pages