S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/08/2016 - 02:27

పెదబయలు, మే 7: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు శనివారం భారీ బహిరంగసభ నిర్వహించినట్లు సమాచారం. విశాఖ జిల్లా పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దు బెజ్జంగి అటవీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభకు జనం పెద్దసంఖ్యలో తరలివచ్చినట్లు తెలియవచ్చింది. ఇటీవల మృతి చెందిన మావోల వివరాలు వెల్లడించిన కామ్రేడ్లు వారికి నివాళులర్పించినట్లు తెలుస్తోంది.

05/08/2016 - 02:20

మందస, మే 7: శ్రీకాకుళం జిల్లా మందస మండలం మీలగంగువాడ సముద్రతీరానికి శనివారం భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. తిమింగలం 20 అడుగుల పొడవు, సుమారు పది టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. సముద్రంలో నౌకలు వల్ల గాయపడి చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చిఉంటుందని భావిస్తున్నారు. తీరానికి చేరిన తిమింగలం రకరకాల వర్ణాలతో ఉంది. అరుదైన భారీ తిమింగలాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.

05/08/2016 - 02:18

సింహాచలం, మే 7: సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం (నిజరూప దర్శనం) సోమవారం జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజున చందనోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక అర్చకులు మూలవిరాట్‌పై ఉన్న గంధాన్ని ఒలుస్తారు. స్వామిని నిజరూపంలోకి తీసుకువచ్చాక శిరస్సు, హృదయంపై పచ్చిగంధం ముద్దలు ఉంచుతారు.

05/07/2016 - 18:01

కర్నూలు: కర్నూలు వైకాపా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి శనివారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. నగరంలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టిడిపిలో చేరారు. వైకాపాలో ఇటీవలి పరిణామాలతో ఇమడలేకే తాను పార్టీ మారానని మోహన్‌రెడ్డి తెలిపారు.

05/07/2016 - 17:59

గుంటూరు: ఇక్కడి పట్నంబజార్‌కు చెందిన రేవంత్ సాయికుమార్ అనే మూడేళ్ల బాలుడిని శనివారం నాడు కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు శివశంకరరావు, సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దంపతులకు చెందిన భవానీ కిడ్స్ ఫ్యాషన్ షాపులో దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు నటించిన దుండగులు అక్కడే ఉన్న సాయికుమార్‌ను ఎత్తుకుని బైక్‌పై పరారయ్యారు.

05/07/2016 - 17:56

విజయవాడ: కోటి రూపాయల మేరకు బకాయిపడ్డ ఆస్తిపన్నును చెల్లించకపోవడంతో నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ భవనాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు శనివారం జప్తు చేశారు.

05/07/2016 - 15:01

విజయవాడ: ఎపిని కరవులేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, ఇందుకు అన్నివర్గాల సహకారం అవసరమని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన శనివారం 8వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకాన్ని యుద్ధప్రాతిపదికపై చేపట్టాలన్నారు. జల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేస్తామన్నారు.

05/07/2016 - 15:00

గుంటూరు: కృష్ణా నదిపై తెలంగాణలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను ఎలాగైనా అడ్డుకుంటామని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఆయన శనివారం గుంటూరు జిల్లాలో పలుచోట్ల ఇంకుడుగుంతల నిర్మాణాన్ని పరిశీలించారు. ఎపిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నీటిని విడుదల చేయాల్సిందిగా కృష్ణాజలాల బోర్డును కోరతామన్నారు.

05/07/2016 - 15:00

తిరుపతి: తమపై దాడికి దిగిన ఎర్రచందనం స్మగ్లర్ల బారి నుంచి బయటపడేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఇక్కడికి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో గెందిబండ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. తమకు పోలీసులు తారసపడడంతో స్మగ్లర్లు రాళ్లదాడికి దిగారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

05/07/2016 - 12:12

విజయనగరం: ఓ వివాహిత అనుమానాస్పదంగా మరణించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎస్.కోట మండలం ధర్మవరంలో కుమారి అనే వివాహిత శనివారం మరణించింది. ఆమె మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Pages