S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/07/2016 - 12:10

రాజమండ్రి: పంచాయితీరాజ్ ఇఇ దుర్గాప్రసాదరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఇక్కడి ఆయన ఇంట్లో శనివారం ఉదయం ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని అక్రమాస్తులను వారు గుర్తించినట్లు సమాచారం.

05/07/2016 - 07:22

మచిలీపట్నం, మే 6: రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘోర రోడ్డు ప్రమాదం నుండి క్షేమంగా బయట పడ్డారు. గురువారం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పర్యటన ముగించుకుని విజయవాడ వస్తుండగా రవీంద్ర ప్రయాణిస్తున్న వాహనం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరి కాజ టోల్‌గేట్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది.

05/07/2016 - 07:21

రాజమహేంద్రవరం, మే 6: గురుడు కన్యారాశిలో ప్రవేశించడంతో ఆగస్టులో వచ్చే కృష్ణా పుష్కరాలు దిగ్విజయం కావాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ అన్నారు. గోదావరి పుష్కరాల మాదిరిగా కాకుండా కృష్ణా పుష్కరాలు దిగ్విజయం కావాలంటే అధికారులు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

05/07/2016 - 04:13

విజయవాడ, మే 6: రాష్ట్రానికి దామాష పద్ధతిన రావల్సిన కృష్ణా, గోదావరి జలాలను యథాతథంగా ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనిపై ఎంతటి పోరాటికైనా సిద్ధమని స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు చెప్పారు. విజయవాడ శుక్రవారం జరిగిన నీరు ప్రగతి చర్చా గోష్ఠిలో చంద్రబాబు పాల్గొన్నారు.

05/07/2016 - 04:09

నందిగామ/ఏలూరు/కాకినాడ,మే 6:ఆంధ్రావనిలో శుక్రవారం కురిసిన భారీ వర్షం ఓ పక్క ఆనందాన్ని, మరోపక్క విషాదానే్న జనానికి మిగిల్చింది. గ్రీష్మతాపం నుంచి స్వల్ప ఉపశమనమన్న ఆనందమే తప్ప భయానక గాలులతో కూడిన భీకర వర్షం వల్ల భారీగానే నష్టం వాటిల్లింది. చేతికందే మామిడి నేల రాలడంతో రైతన్న డీలా పడ్డాడు. చెట్లు, కరెంట్ తీగెలు తెగిపడటంతో జనజీవనం స్తంభించింది.

05/07/2016 - 04:02

విజయవాడ, మే 6: రాజధాని అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, అందులో సాధ్యాసాధ్యాయలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

05/07/2016 - 03:54

కర్నూలు, మే 6: వైకాపాకు రాజీనామా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో శనివారం తెలుగుదేశం పార్టీలో పార్టీలో చేరుతున్నట్టు కర్నూ లు వైకాపా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు.

05/06/2016 - 18:10

గుంటూరు: ఇక్కడి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎఆర్ కానిస్టేబుల్ రమేష్ శుక్రవారం నాడు తన తుపాకీని శుభ్రం చేస్తుండగా అది పొరపాటున పేలింది. గాయపడిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

05/06/2016 - 18:10

విశాఖ: నగరంలోని ఓ ప్రముఖ జ్యూయలరీ షాపులో జరిగిన చోరీకి సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి 35 బంగారు బిస్కట్లను స్వాధీనం చేశారు. ఆ జ్యూయలరీ దుకాణంలో సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న రవికుమార్ రెడ్డి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

05/06/2016 - 14:31

విశాఖ: పదోతరగతి పరీక్షా ఫలితాలను ఈనెల 10న విడుదల చేస్తామని ఎపి మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఎంసెట్ ఫలితాలను 9న విడుదల చేస్తామన్నారు. మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ‘నీట్’ నుంచి ఎపిని మినహాయించాలని సుప్రీం కోర్టులో అప్పీలు చేశామని ఆయన తెలిపారు.

Pages