S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/06/2016 - 14:30

కాకినాడ: నాటుసారా నియంత్రణ పేరుతో తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఎక్సయిజ్ పోలీసులను నిర్బంధించారు. ఏలేశ్వరం మండలం అప్పనపాలెంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మద్యం వ్యాపారులకు కొమ్ము కాస్తున్న ఎక్సయిజ్ పోలీసులు నాటుసారా నియంత్రణ పేరుతో గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

05/06/2016 - 14:27

హైదరాబాద్: ప్రభుత్వం నుంచి తుది అనుమతి రాగానే సుమారు 12వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఎపిపిఎస్‌సి చైర్మన్ ఉదయభాస్కర్ శుక్రవారం తెలిపారు. ఎపిపిఎస్‌సి నూతన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగాలకు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఇలా చేసుకున్నవారికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపుతామన్నారు.

05/06/2016 - 14:26

కాకినాడ: ఎక్కడో బిహార్ నుంచి వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పెద్దాపురం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్న ప్రజ్ఞా పరనబ్, అమిత్‌కుమార్ శుక్రవారం ఉదయం తరగతులకు హాజరై బైక్‌పై తిరిగి వస్తుండగా ఎడిబి రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.

05/06/2016 - 13:44

సంగం, మే 5: ప్రపంచ పర్వతారోహకులు మల్లి మస్తాన్‌బాబు జీవిత చరిత్రని రాష్ట్రప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చింది. 8వ తరగతి తెలుగు ఉపవాచకంలో ‘స్ఫూర్తిప్రదాతలు’ అనే శీర్షికతో పాఠ్యాంశంగా చేర్చింది.

05/06/2016 - 13:42

కర్నూలు, మే 5: తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో దీక్ష చేయడం ఏమిటని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు. కర్నూలులో గురువారం ఆయన మాట్లాడుతూ రాయలసీమ కంటే ఎక్కువగా కృష్ణా డెల్టాకే తెలంగాణ ప్రాజెక్టులు ఇబ్బందులు సృష్టిస్తాయని తెలిపారు.

05/06/2016 - 13:41

విశాఖపట్నం, మే 5: బిఎస్సీ కెమిస్ట్రీ పరీక్ష పేపర్ లీక్ ఉదంతం మరిచిపోక ముందే ఎన్విరాన్‌మెంటల్ సైన్సు పరీక్ష పేపరును 50 మార్కులకు బదులు 75 మార్కులకు సెట్ చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు తమ నిర్వాకం వెలగబెట్టారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ర్యాంకింగ్‌కు దరఖాస్తు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయు అధికారులు తాజాగా మరోసారి విమర్శలపాలయ్యారు.

05/06/2016 - 13:40

విజయవాడ, మే 5: రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన బిజెపితో అనుబంధంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను సాధిస్తామని, రాష్ట్భ్రావృద్ధి కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చిన సిఎం చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

05/06/2016 - 13:40

విశాఖపట్నం, మే 5: విశాఖ జిల్లా హుకుంపేట మండలం పనసపుట్టు గ్రామానికి చెందిన 10 మందికి ఆంత్రాక్స్ సోకినట్లు గ్వాలియర్‌లోని ప్రయోగశాల నిర్ధారించింది. గ్రామానికి చెందిన 19 మంది ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖలోని కింగ్‌జార్జి ఆసుపత్రిలో వైద్యచికిత్స నిమిత్తం చేరిన సంగతి తెలిసిందే. వారి రక్తనమూనాలను సేకరించిన గ్వాలియర్ ప్రత్యేక బృందం ప్రయోగశాలకు పంపింది.

05/06/2016 - 13:39

గుంటూరు, మే 5: ప్రత్యేక హోదా సాధనకు అవసరమైతే ఢిల్లీలో మరో పోరాటం నిర్వహించేందుకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు సిపిఐ, ప్రత్యేకహోదా సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు.

05/06/2016 - 13:39

విజయవాడ, మే 5: రాజధాని అమరావతిలో రైతులు తెలివిమీరిపోయారు. ఓపక్క రాజధానికి భూములు ఇచ్చినట్టే ఇచ్చి, వాటిని అమ్ముకొని చాలా మంది రైతులు సొమ్ము చేసుకున్నారు. మరికొంతమంది ఉన్న పొలంలోనే ఐదంతస్థుల భవనాలను నిర్మించి, ఇక్కడికి వచ్చే ఉద్యోగులకు అద్దెకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

Pages