S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/06/2016 - 13:38

గుడ్లూరు, మే 5: ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో ఉన్న రామదూతస్వామిని కేంద్ర మంత్రి గడ్కరీ గురువారం సతీసమేతంగా దర్శించుకున్నారు. రామదూత ఆశ్రమంలో శ్రీ లక్ష్మీదాంపత్యవ్రత విరమణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖామంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర సహాయ మంత్రి సుజనాచౌదరి హాజరయ్యారు.

05/06/2016 - 13:38

ఏలూరు, మే 5: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంక గ్రామంలో వివాదాస్పద చేపల చెరువుల్లో పట్టుబడికి గ్రామస్థులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. న్యాయస్థానం స్టే కొనసాగుతున్న ఈ చెరువుల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టరాదని అటవీ, పోలీసు శాఖ అధికార్లు అడ్డుకున్నారు. దీనితో ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలిలావున్నాయి...

05/06/2016 - 13:37

కడప,మే 5: వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తరచూ ఆయన జిల్లా పర్యటనలు చేస్తూ ప్రభుత్వ పథకాల అమలుకు జిల్లాలోనే శ్రీకారం చుడుతున్నారు. గతనెల 25న జిల్లా పర్యటనకు వచ్చి రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో నీరు-చెట్టు, పంట సంజీవని, ఇంకుడు గుంతల తవ్వకాలను ప్రారంభించారు.

05/06/2016 - 13:37

విజయనగరం, మే 5: పూర్వకాలంలో సాగునీరు, తాగునీరు విషయంలో ప్రజలు, పాలకులు ముందుచూపుతో వ్యవహరించిన కారణంగా ఎటువంటి ఇబ్బందులు కలగలేదని, కానీ ఇప్పుడు పాలకులు, ప్రజలు జలాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

05/06/2016 - 13:36

కర్నూలు ఓల్డ్‌సిటీ, మే 5: కృష్ణా, తుంగభద్ర నదులపై తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలుంటే ఇరు రాష్ట్రాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని కరవుపీడిత ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర మాజీమంత్రి పురంధ్రీశ్వరి అన్నారు.

05/06/2016 - 13:36

విశాఖపట్నం, మే 5: ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న 19 మంది గిరిజనులు గురువారం తెల్లవారుజామున స్వగ్రామాలకు పారిపోయారు. ఒకేసారి ఇంతమంది రోగులు ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రి నుంచి పారిపోవడం వైద్యవర్గాలను కలవరపాటుకు గురిచేశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా హుకుంపేట మండలం పనస్‌పుట్ గ్రామానికి చెందిన 19 మంది గిరిజనులు ఇటీవల ఆంత్రాక్స్ లక్షణాలతో కెజిహెచ్‌లో చేరారు.

05/06/2016 - 13:35

పాడేరు, మే 5: ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరెనికగన్న పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించనున్నారు. విశాఖ ఏజెన్సీ డివిజనల్ కేంద్రమైన పాడేరులో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మోదకొండమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర వేడుకగా గుర్తిస్తూ ప్రభుత్వం గత నెల 28న ఉత్తర్వులు జారీచేసింది.

05/06/2016 - 12:54

విశాఖ : ఆంధ్రప్రదేశ్ పాలీసెట్‌ -2016లో మొత్తం 82.32శాతం ఉత్తీర్ణత సాధించారు. మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఈ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. బాలికలు 87.5 శాతం, బాలురు 82.2 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు.

05/06/2016 - 12:18

గుంటూరు: ఇద్దరు పిల్లలతో ఈతకు వెళ్లిన తండ్రి నీట మునిగి మరణించిన విషాద సంఘటన తాడేపల్లి మండలం సీతానగరం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. లక్ష్మీనారాయణ (45) అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో ఈతకు కృష్ణా నది వద్దకు వెళ్లాడు. ఈత కొడుతుండగా నీటమునిగి లక్ష్మీనారాయణ మరణించగా, ఇద్దరు పిల్లలు క్షేమంగా ఒడ్డుకుచేరారు.

05/06/2016 - 12:13

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేసి ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.

Pages