S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/06/2016 - 12:13

విజయవాడ: వేసవి తాపంతో కొద్దిరోజులుగా జనం హడలెత్తిపోతుండగా శుక్రవారం తెల్లవారుజామున పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో పంటనష్టం జరిగింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షంతో జనం ఉపశమనం పొందారు. తాడేపల్లిలో హోర్డింగ్ కూలి ఒకరు, చిత్తూరులో విద్యుత్ తీగలు తగిలి మరొకరు మరణించారు.

05/05/2016 - 18:07

విశాఖ: కొయ్యూరు మండలం మురిపాకల వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ముఖ్యనేత అజాద్ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. మావోలు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మరణించిన సంగతి తెలిసిందే. గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న అజాద్‌పై గతంలోనే పోలీసులు నాలుగు లక్షల రివార్డు ప్రకటించారు. మృతుల్లో మిగతా ఇద్దరిని ఇంకా గుర్తించాల్సి ఉంది.

05/05/2016 - 18:06

విజయనగరం:వ్యవసాయ రంగంలో వెనుకబడిన విజయనగరం జిల్లా రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని సిఎం చంద్రబాబు సూచించారు. డెంకాడ మండలం సింగవరంలో గురువారం ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జలసిరి కార్యక్రమం కింద చెరువులను ఆధునీకరిస్తామన్నారు. వర్షపునీటి వృథా కానీయకుండా ఇంకుడుగుంతలు,పంటకుంటలు తవ్వాలని రైతులకు హితవుపలికారు.

05/05/2016 - 17:13

విశాఖ: ఏపీ పాలీసెట్ ఫలితాలు రేపు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.

05/05/2016 - 17:08

విజయనగరం: లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో పాటు రైతులకు రుణమాఫీని అమలు చేసిందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం విజయనగరం జిల్లాలో నీరు-ప్రగతి కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత గత రెండేళ్లుగా ఎపిని సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో తగినన్ని నిధులిచ్చి కేంద్రం సహకరించాలన్నారు.

05/05/2016 - 17:08

విజయవాడ: ‘ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారంటే అది శిలాశాసనం అవతుందని అనుకున్నాం.. అయితే ఇలా చేస్తారని ఊహించలేదు.. ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చేదిలేదంటూ కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలు 5 కోట్ల ఆంధ్రులను క్షోభకు గురిచేశాయి..’- అని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా గురువారం ఇక్కడ మీడియాతో అన్నారు.

05/05/2016 - 17:07

శ్రీకాకుళం: ఎపికి ప్రత్యేకహోదా దక్కాలంటే పార్టీలకు అతీతంగా బలమైన ఉద్యమం చేపట్టాలని వైకాపా నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. ప్రత్యేకహోదా ఇచ్చేదిలేదంటూ కేంద్రం స్పష్టం చేసినందున రాజకీయాలను పక్కనపెట్టి అన్ని పార్టీలూ ఒకే లక్ష్యంతో పోరాడాలన్నారు. అన్ని విధాలా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు గత రెండేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా దక్కలేదన్నారు.

05/05/2016 - 15:11

కర్నూలు: తెలంగాణలో చేపట్టే ప్రాజెక్టులపై నిరసన తెలిపేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్ దీక్షకు దిగితే రాయలసీమకు నష్టమే జరుగుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి గురువారం తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులపై కెసిఆర్, చంద్రబాబు, జగన్ ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. తెలంగాణ సహకరించకుంటే రాయలసీమకు మనుగడ లేదన్నారు.

05/05/2016 - 15:10

హైదరాబాద్: ఎపి రాజధాని అమరావతికి తరలివెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ పలు సమస్యలు వేధిస్తున్నాయని ఎపి ఉద్యోగ సంఘాల నేత మురళీకృష్ణ గురువారం ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు నివేదించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమ పిల్లలకు అడ్మిషన్లు దొరకడం లేదని, అమరావతి ప్రాంతంలో ఇంటి అద్దెలను నియంత్రించాలని ఆయన వివరించారు.

05/05/2016 - 15:10

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా సాధించేందుకు టిడిపి పోరుబాటను ఎంచుకుంటే తాము మద్దతు ఇస్తామని సిపిఎం నేత మధు గురువారం ఇక్కడ ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించి ఎన్‌డిఎ సర్కారు రాష్ట్ర ప్రజల్ని మోసగించిందన్నారు. బిజెపి తీరు తెలిశాక టిడిపి నేతలు ఇపుడు ఏం మాట్లాడతారని ఆయన నిలదీశారు.

Pages