S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/03/2016 - 16:42

విజయవాడ: ఎంఆర్‌పి (గరిష్ట చిల్లర ధర) కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎపి ఎక్సయిజ్ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం హెచ్చరించారు. చాలాచోట్ల అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ 200 మంది మద్యం దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.

05/03/2016 - 16:41

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు టిడిపి అధినేత చంద్రబాబుకు మంగళవారం లేఖ రాశారు. గత శుక్రవారం ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినపుడు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టిడిపి ఎంపీలు సానుకూలంగా మాట్లాడారు.

05/03/2016 - 14:28

హైదరాబాద్: తెలంగాణలో అనుమతులు లేని సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తే ఆంధ్ర, సీమ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారంటూ తెరాస మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి అనాలోచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

05/03/2016 - 14:23

విజయవాడ: ఈనెల 27 నుంచి మూడురోజుల పాటు తిరుపతిలో పార్టీ మహానాడు జరపాలని టిడిపి పాలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఇక్కడ మంగళవారం టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పాలిట్‌బ్యూరో సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరవు పరిస్థితులు, నీటిపారుదల ప్రాజెక్టుల వివాదాలు వంటి అంశాలపై మహానాడులో తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది.

05/03/2016 - 14:22

విజయవాడ: పార్టీలో నేతలు విభేదాలకు స్వస్తి పలికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలని టిడిపి అధినేత,సిఎం చంద్రబాబు కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి, శిల్పా మోహనరెడ్డి సోదరులకు గట్టిగా చెప్పారు. బాబు చెప్పినట్లు ఇకముందు కలహాలకు దూరంగా కలిసి పనిచేస్తామని భూమా, శిల్పా సోదరులు ప్రకటించారు. దీంతో నేతల మధ్య వివాదం సద్దుమణిగింది.

05/03/2016 - 11:55

విజయవాడ: కర్నూలు జిల్లాలో టిడిపి నేతల మధ్య సమన్వయం సాధించేందుకు ఆ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. పార్టీలో రెండు వర్గాలుగా ఉంటున్న భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి సోదరులు మంగళవారం ఉదయం ఇక్కడ బాబును కలిశారు. పార్టీని బలోపేతం చేసేందుకు వర్గవిభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో పనిచేయాలని ఆయన హితవు పలికారని తెలిసింది.

05/03/2016 - 05:01

హైదరాబాద్, మే 2: కరవుపై వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. మాచర్లలో జగన్ తలపెట్టిన ధర్నాకు వైకాపా నాయకులు తప్ప ప్రజలెవరూ రాలేదన్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రిని కలిసిన జగన్ రాష్ట్ర కరవుపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తారు.

05/03/2016 - 04:59

హైదరాబాద్, మే 2: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్ళాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎపి శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు.

05/03/2016 - 04:53

విజయవాడ, మే 2: వైకాపా నుంచి వలసలు జోరందుకుంటున్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో అదే స్పీడులో వర్గ రాజకీయాలు కూడా ఊపందుకుంటున్నాయి. భూమా వర్గీయులు తమ అనుచరులపై దాడి చేస్తున్నారంటూ మాజీ మంత్రి, నంద్యాల తెలుగుదేశం ఇన్‌చార్జ్ శిల్పా మోహన్‌రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో రెండు వర్గాలను పిలిపించుకుని పంచాయితీ పెట్టారు.

05/03/2016 - 04:47

రాజమహేంద్రవరం, మే 2: రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిల పొత్తు కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితులు నెలకొంటున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్రం నుండి రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి సహాయం అందడంలేదన్నారు. రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్‌తోపాటు బిజెపికీ భాగం ఉందన్నారు.

Pages