S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/22/2016 - 05:30

విశాఖాపట్నం: బ్రెయిన్ డెడ్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థి అవయవ దానం చేసి ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపారు. అవయవదాన ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఈ ఘటన విశాఖలో జరిగింది. అతని కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. నగరంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో 19 ఏళ్ల సాయికుమార్ బి.టెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మోటార్ బైక్ నడుపుతూ ఈ నె 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలపాలయ్యాడు.

02/22/2016 - 05:21

రాజమహేంద్రవరం: ఇసుక ఇ వేలం విధానంలో కొత్తగా సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం నుండి మలి దశ జరగనున్న ఇసుక రీచ్‌ల వేలం ప్రక్రియను సవరించిన విధానాల ప్రకారం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు చేసింది. కొత్తగా సవరించిన విధానం ప్రకారం ఇ వేలంలో పాల్గొనే బిడ్డర్లు ఎక్కువ మంది ఒకే ధరను కోట్ చేసిన పక్షంలో లాటరీ ద్వారా టెండరును ఖరారుచేయాల్సి ఉంటుంది.

02/22/2016 - 05:13

రాజుపాలెం: రసాభాస మధ్య ఎట్టకేలకు బందోబస్తుతో భువనచంద్ర చెక్‌డ్యామ్‌కు ఆదివారం గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు శంకుస్థాపన చేశారు. చెక్‌డ్యామ్ వలన భూములు కోల్పోతున్న రైతులు, మహిళలు, కుటుంబ సభ్యులు శంకుస్థాపనను అడ్డుకోగా పోలీసులు చెదరగొట్టారు.

02/22/2016 - 01:17

కొయ్యూరు: విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు మండల పరిధి మఠం భీమవరం పంచాయతీ గడిమామిడి సమీపంలో కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనతో మన్యవాసులు ఉలిక్కిపడి భయాందోళన చెందుతున్నారు.

02/21/2016 - 15:32

హైదరాబాద్ : మే 17 నుంచి విజయవాడ నుంచే ఆర్టీసీ పాలనా వ్యవహారాలు కొనసాగుతాయని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆదివారం వెల్లడించారు. ఈ ఏడాది రూ.120 కోట్ల నష్టాన్ని తగ్గించామని చెప్పారు. డీలక్స్, సూపర్‌ లగ్జరీ, వోల్వో బస్సుల్లో ఆఖరి రెండు వరుసలలోని ప్రయాణికులకు 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు సాంబశివరావు తెలిపారు.

02/21/2016 - 15:29

చిత్తూరు: శేషాచలం అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం కూంబింగ్ జరుపుతున్న ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లవర్షం కురిపించారు. వెంటనే పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో కూలీలు పరారయ్యారు. 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలను ఉద్ధృతం చేశారు.

02/21/2016 - 15:29

విశాఖ: విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు మండలం రేవులకోట అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మరణించారు. ఇంకా ఇరుపక్షాల మధ్య కాల్పులు జరుగుతున్నందున పూర్తి వివరాలు తెలియరాలేదు.

02/21/2016 - 13:23

శ్రీనగర్:ఉగ్రవాదులతో జరుగుతున్న కాల్పుల్లో సైన్యానికి చెందిన కెప్టెన్ పవన్‌కుమార్ (22) వీరమరణం పొందారు. శనివారం సాయంత్రం బస్సుపై కాల్పులతో దాడికి దిగిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు పోరాటం ప్రారంబించిన పదిమంది సైనికుల బృందాన్ని ముందుండి నడిపించిన పవన్ కాల్పుల్లో గాయపడి ఆదివారం ఉదయం మరణించారు. కాగా శనివారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక పౌరుడు, ఇద్దరు సైనికులు మరణించిన విషయం తెలిసిందే.

02/21/2016 - 09:10

చిత్తూరు: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. వైకాపా, టిడిపి కార్పొరేటర్ల మధ్య బడ్జెట్ వ్యవహారంగా తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. శనివారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో చిత్తూరు కార్పొరేషన్ 2016-17 బడ్జెట్ సమావేశం ఇన్‌చార్జ్ మేయర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది.

02/21/2016 - 09:08

హైదరాబాద్: ఏ రాష్ట్ర పురోభివృద్ధి అయినా మాతృభాషల మనుగడతోనే ముడిపడి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఐటి, సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి అన్నారు. మాతృభాష అభివృద్ధి, సంస్కృతీ, సంప్రదాయాలను నిలబెట్టేందుకు టిడిపి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.

Pages