S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/02/2016 - 16:51

విజయవాడ: వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మూడు రోజుల పసికందు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మృతి చెందింది. ఇక్కడ పాత జిల్లా ఆసుపత్రిలో మూడురోజుల క్రితం ఓ శిశువు జన్మించింది. అనారోగ్యంగా ఉండడంతో శిశువుకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే, సోమవారం ఉదయం సెలైన్ బాటిల్ పడి శిశువు మృతిచెందినట్లు మిగతా రోగులు చెబుతున్నారు.

05/02/2016 - 16:49

గుంటూరు: ఎపిలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు, కూలీలు, సామాన్య ప్రజలను ఆదుకునేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. ఆయన సోమవారం మాచర్లలో వైకాపా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద సిమెంటు రోడ్లు నిర్మిస్తున్నారని, తాగునీటి సమస్యపై దృష్టి సారించడం లేదని అన్నారు.

05/02/2016 - 14:48

విశాఖ: రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు విశాఖలో వెంటనే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు ట్విట్టర్‌లో సందేశాలను పోస్ట్ చేసినట్లు వేదిక ప్రతినిధులు తెలిపారు.

05/02/2016 - 11:59

విజయవాడ: రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ధ్యాస తప్ప ప్రజాసేవ చేయాలన్న ఆలోచన వైఎస్ జగన్‌కు ఏనాడూ లేదని ఎపి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ కారణంనే గత ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. జగన్ వైఖరి వల్లే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వలసపోతున్నారని, వైకాపా నడిసముద్రంలో మునిగిపోతున్న నావ అని ఆయన వ్యాఖ్యానించారు.

05/02/2016 - 11:50

విజయవాడ: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఎపి వాసులను వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ విషయమై వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాసినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం తెలిపారు. బోగస్ ఏజెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లిన వారు అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ఏజెన్సీల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

05/02/2016 - 11:50

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. నీటి ఎద్దడి, రాజధాని నిర్మాణం, భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు, బందరు పోర్టు, రైతులకు రుణమాఫీ, ప్రభుత్వ పాఠశాలల్లో యోగా విధానం, ప్రత్యేక హోదా వంటి విషయాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొన్ని కీలక నిర్ణయాలను సిఎం ప్రకటించనున్నట్లు సమాచారం.

05/02/2016 - 11:50

విజయవాడ: ఇక్కడి సిఆర్‌డిఎ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులతో సిఎం చంద్రబాబు సోమవారం ఉదయం సమావేశమయ్యారు. మున్సిపల్ మంత్రి నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు, రాజధాని నిర్మాణం తదితర విషయాలపై తాజా పరిస్థితిని సిఎం తెలుసుకున్నారు.

05/02/2016 - 11:49

విజయవాడ: ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద సోమవారం ఉదయం రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో పాతికమంది బాలలు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

05/02/2016 - 11:49

విజయనగరం: బాడంగి మండల హౌసింగ్ ఎఇ సత్యం ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో సోమవారం ఉదయం ఆయన ఇళ్లపై ఎసిబి అధికారులు దాడులు చేశారు. అక్రమాస్తుల వివరాలు ఇంకా తేలాల్సి ఉంది.

05/02/2016 - 05:52

విజయవాడ, మే 1: రాష్ట్భ్రావృద్ధిలో ఎంతో కీలకమైన పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం ఇటు కార్మికులు, అటు యాజమాన్యాల మధ్య వారధిగా నిలవటమే గాక కార్మికులకు అన్యాయం జరుగకుండా బాధ్యత తీసుకునే పరిశ్రమల యాజమాన్యానికి అండగా నిలుస్తానం టూ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. అలాగే తమకు ఉపాధి చూపుతున్న యాజమాన్యాల పేరు ప్రతిష్టలను పెంచే విధంగా కార్మికులు నడుచుకోవాలని పిలుపునిచ్చారు.

Pages