S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/30/2016 - 07:51

హైదరాబాద్, ఏప్రిల్ 29: భారత రైల్వే శాఖ పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లలో కనీస అవసరాల ఏర్పాట్లు చేపట్టింది. తాగునీరు, మరుగు దొడ్లు, ప్లాట్ ఫాంల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది.

04/30/2016 - 07:50

తిరుపతి, ఏప్రిల్ 29: తిరుపతి నగరపాలక సంస్థ వెబ్‌సైట్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హ్యాకింగ్‌కు గురైంది. హ్యాక్ చేసిన వ్యక్తి బంగ్లాదేశీయుడిగా గుర్తించారు. తాము ముస్లిములమని, ఉగ్రవాదులు కాదని డార్క్‌డైమెండ్ పేరుతో జహీర్‌ఖాన్ అనే వ్యక్తి ఒక సందేశాన్ని పెట్టాడు. ఊహించని ఈ పరిణామానికి నగరపాలక సంస్థ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

04/30/2016 - 07:50

హైదరాబాద్, ఏప్రిల్ 29: దళితులు, గిరిజనుల అభివృద్ధి విద్యతోనే సాధ్యం అవుతుందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్సీ టక్కర్ పేర్కొన్నారు. దళిత విద్యార్ధులకు మెరుగైన విద్యను సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, వాటిని అందిపుచ్చుకుని భవిష్యత్‌కు బాటలు వేయాలని సూచించారు.

04/30/2016 - 07:49

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును బోర్డు అధికారులు శుక్రవారం నాడు ప్రకటించారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 2వ తేదీ నుండి 6వ తేదీ వరకూ జరుగుతాయని, ఎథిక్స్ -హుమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 7న జరుగుతుందని చెప్పారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 8న జరుగుతుంది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం మే 24 నుండి జరుగుతాయి.

04/30/2016 - 07:49

హైదరాబాద్, ఏప్రిల్ 29: జిహెచ్‌ఎంసి పరిధిలో రాబోయే సాధారణ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన రోజే నిర్వహించాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కోరడం ద్వారా వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్ పౌరులను అవమానించినట్టయిందని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. డబుల్ ఓటింగ్‌ను నివారించవచ్చని, ఫెయిర్‌గా ఎన్నికలు జరపవచ్చని జగన్ పేర్కొనడం దారుణమని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

04/30/2016 - 07:48

హైదరాబాద్, ఏప్రిల్ 29: వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన అట్టర్‌ఫ్లాప్ అయిందని , రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకునే జగన్ దురుద్ధేశ్యాలు బట్టబయలు అయ్యాయని తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడికి లక్షకోట్ల ఫోబియా పట్టుకుందని, ఆధారాలు అడిగితే జగన్ చేతులెత్తేస్తున్నారని పేర్కొన్నారు.

04/30/2016 - 07:45

హైదరాబాద్, ఏప్రిల్ 29: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో 2016-17 విద్యాసంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించినట్టు సీపెట్ చీఫ్ మేనేజర్ కిరణ్‌కుమార్ తెలిపారు.

04/30/2016 - 07:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్టమ్రంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవరావు విలేఖరులతో మాట్లాడుతూ రోడ్డు భద్రతపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

04/30/2016 - 07:38

రాజంపేట, ఏప్రిల్ 29: పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కే ఇవ్వాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం కడప జిల్లా రాజంపేట మండల పరిషత్ అతిథిగృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీ రామారావు రూపొందించిన తెలుగుదేశం పార్టీ మార్గదర్శకాలు, సిద్ధాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిలోదకాలిస్తున్నారని దుయ్యబట్టారు.

04/30/2016 - 07:38

కడప/కర్నూలు/అనంతపురం, ఏప్రిల్ 29:కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో శుక్రవారం వడదెబ్బకు 10 మంది మృతిచెందారు.

Pages