S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/14/2016 - 07:31

గుంటూరు: సున్నితమైన ఎస్సీ వర్గీకరణ అంశంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించేముందు ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించిన తర్వాత మాట్లాడితే బాగుండేదేమో అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. శనివారం గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

02/14/2016 - 07:29

రాజమహేంద్రవరం: మేధావులతో చర్చలు..నెలల తరబడి అధ్యయనాలు..మంత్రి ఉపసంఘం చర్చల ఫలితాలతో రూపొందించిన కొత్త ఇసుక విధానం బెడిసికొట్టేలా కనిపిస్తోంది.

02/14/2016 - 07:28

విశాఖపట్నం: ఈ ఏడాది దేశంలోను, రాష్ట్రంలోను విపరీత పరిస్థితులు నెలకొంటాయని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. శనితో కలిసి కుజుడు వృశ్చిక రాశిలో ఉండే ఎనిమిది నెలల కాలం పలు వైపరీత్యాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని పీఠంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.

02/14/2016 - 07:27

రాజమహేంద్రవరం:కాలువ గట్లపై సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటుచేయటం ద్వారా జూన్ నాటికి పశ్చిమగోదావరి జిల్లా లోని రెండు ప్రాంతాల నుండి ఆరు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిచేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాలువ గట్లపై ఇలా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తొలిసారి.

02/14/2016 - 07:19

తిరుమల: కోటి రూపాయలు విలువచేసే వజ్ర కిరీటాన్ని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకి చెందిన బాలమురుగన్, అన్నపూర్ణ దంపతులు శనివారం టిటిడికి విరాళంగా ఇచ్చారు. ఈ కిరీటాన్ని మలయప్ప స్వామికి అలంకరించనున్నారు. ఈసందర్భంగా బాలమురుగన్ మాట్లాడుతూ ఈ కిరీటాన్ని తయారు చేయడానికి నెల రోజులు సమయం పట్టిందని తెలిపారు.

02/14/2016 - 07:15

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సూర్యజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రథసప్తమి వేడుకలను నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనేపథ్యంలో ఆదివారం తిరుమల్లో నిర్వహించే ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. ఈరథసప్తమి వేడుకలను భక్తుల మినీ బ్రహ్మోత్సవమని భావిస్తారు.

02/13/2016 - 19:42

అనంతపురం:అనంతపురం జిల్లా హిందూపురంలో డిగ్రీ కళాశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. కళాశాలనుండి ఇంటికి నడిచివెళుతున్న ఆ విద్యార్థినిపై వెనుకనుంచి వచ్చిన కొందరు విద్యార్థులు ఈ దాడికి పాల్పడ్డారు. గాయపడిన విద్యార్థిని స్థానికులు గమనించి చికిత్సకోసం ఆస్ప్రత్రికి తరలించారు.

02/13/2016 - 14:04

విజయవాడ:బీసీలకు మొదటినుండి తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తోందని, ఆ విధానం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన బీసి రుణమేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని వర్తింపచేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.

02/13/2016 - 12:24

శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలో ఎక్సైజ్ అధికారి సురేష్ ప్రసాద్ కారు బీభత్సం సృష్టించడంతో సైకిల్‌పై వెళ్తున్న తొమ్మిదవ తరగతి విద్యార్థి మరణించాడు. మద్యం మత్తులో సురేష్ కారు నడపటం వల్లే ఈ దారుణం జరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు పేర్కొన్నారు.

02/13/2016 - 12:24

తిరుమల: కోటి రూపాయల విలువచేసే బంగారు కిరీటాన్ని కోయంబత్తూరుకు చెందిన మురుగన్ దంపతులు శనివారం ఉదయం స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా మురుగన్ దంపతులకు శ్రీవారి ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు.

Pages