S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/27/2016 - 12:30

అనంతపురం: జిల్లాలోని సోమలదొడ్డి వద్ద ఐఎంఎల్ మద్యం డిపోలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ఎత్తున మద్యం సీసాలు, బీర్ బాటిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు 24 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

04/27/2016 - 12:29

తిరుపతి: మూడంతస్థుల భవనం కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద ఓ బాలిక మరణించిన ఘటన ఇక్కడి ఇసుకవీధిలో బుధవారం జరిగింది. గాయపడిన మరో బాలికను వెల్లూరులోని సిఎంసి ఆస్పత్రికి తరలించారు. డ్రైనేజి కాలువ నిర్మాణానికి తవ్వుతుండగా భవనం కూలిపోయింది. ఈ దుర్ఘటనపై ఎపి సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

04/27/2016 - 06:55

గుంటూరు, ఏప్రిల్ 26: రాజధాని ప్రాంతంలో రైతుల భూములపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం అసైన్డ్ భూములను చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.. అమరావతి నగర ప్రతిపాదిత గ్రామాల్లో వాగులు.. డొంక పోరంబోకు భూములు సుమారు 8 వేల ఎకరాల వరకు ఉన్నాయి.. వీటిని వౌలిక సదుపాయాలు.. పార్కులకు వినియోగించాలని నిర్ణయించింది.

04/27/2016 - 06:54

తిరుపతి, ఏప్రిల్ 26: టిటిడిలో సూపరింటెండెంట్ స్థాయిలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు, కల్యాణకట్టలో మేస్ర్తి హోదాలో పనిచేస్తున్న ఒక యూనియన్ నాయకుడు ఇంటిలో మంగళవారం ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ దాడులు బుధవారం ఉదయం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

04/27/2016 - 06:52

మడకశిర, ఏప్రిల్ 26: నూతన రాజధాని అమరావతి భూ సేకరణలో జరిగిన అక్రమాలను త్వరలో బహిర్గతం చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా మడకశిరలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో రైతుల నుండి భూములు తీసుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను ఏమాత్రం పరిష్కరించలేదన్నారు. దీంతో అక్కడి రైతులు కాంగ్రెస్ నేతలను కలసి కన్నీరుమున్నీరవుతున్నారన్నారు.

04/27/2016 - 06:46

ఒంగోలు,ఏప్రిల్ 26: రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ఒంగోలులోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈనెల 29న లక్షలాదిమంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షలకు హాజరౌతున్నారన్నారు.

04/27/2016 - 06:23

కొత్తవలస, ఏప్రిల్ 26: విజయనగరం జిల్లాలో మంగళవారం ఆప్టికల్ ఫైబర్‌లైన్ తెగిపోవడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో నెట్‌సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలికంగా సేవలను పునరుద్దరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గిడిజాల జంక్షన్ వద్ద పురాతన బ్రిడ్జి పనులు చేస్తుండగా జెసిబి డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓఎఫ్‌సి లైను తెగిపోయింది.

04/27/2016 - 06:21

విజయవాడ, ఏప్రిల్ 26: దళిత, గిరిజన, అట్టడుగు వర్గాలకు అండగా ఎస్సీ, ఎస్టీ కమీషన్ పని చేస్తుందని కమీషన్ నూతన చైర్మన్ కారెం శివాజి తెలిపారు. రాష్ట్రంలో స్వయం ఉపాధి కోసం బ్యాంకులు దళిత, గిరిజన వర్గాల యువతకు రుణాలు అందించాలని లేకపోతే కమిషన్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

04/27/2016 - 04:42

విజయవాడ, ఏప్రిల్ 26: రాజధాని అమరావతిలో సుమారు వెయ్యి కోట్లతో 1100 పడకల అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించడానికి ఇండో యుకె ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కింగ్స్ కాలేజీ సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎం చంద్రబాబు నాయుడిని ఈ బృందం కలిసి కింగ్స్ కాలేజీ హాస్పిటల్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందచేసింది.

04/27/2016 - 04:37

విజయవాడ, ఏప్రిల్ 26: విశాఖ-చెన్నై కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఆర్థిక ఆసరా లభించింది. ఈ పారిశ్రామిక కారిడార్ కోసం 3,500 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడిబి) ముందుకు వచ్చింది. విజయవాడ సిఎంఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏడిబి ప్రతినిధులు మంగళవారం కలిశారు. విశాఖ-చెన్నై కారిడార్‌ను త్వరితగతిన పూర్తి చేయడానికి ఏడిబి బృందం హామీ ఇచ్చింది.

Pages