S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/17/2016 - 20:55

హైదరాబాద్, ఏప్రిల్ 16: జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ఉన్నతాధికార కమిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

04/17/2016 - 20:54

తిరుపతి, ఏప్రిల్ 16: స్విమ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తూ సెలవుపై వెళ్లిన డాక్టర్ టి ఎస్ రవికుమార్‌ను పూర్తిస్థాయిలో డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ జిఓ జారీచేసిన నేపథ్యంలో ఆయన శనివా రం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ శివకుమార్ నుంచి రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు.

04/17/2016 - 16:40

న్యూదిల్లి:తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నియమితుడైన కె.లక్ష్మణ్ సారథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనతో లక్ష్మణ్ ఆదివారంనాడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అంశం కేంద్ర న్యాయశాఖ పరిథిలో ఉందని అన్నారు.

04/17/2016 - 06:09

కాకినాడ, ఏప్రిల్ 16: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బిజెపి నిర్ణయంచింది. ఇందులో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటుచేయాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో మోదీ చిత్రపటాన్ని ఏర్పాటుచేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొంటున్నారు.

04/17/2016 - 06:08

జగదాంబ, ఏప్రిల్ 16: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల న్యాయమైన కోర్కెలు, హక్కుల సాధనకు ఈనెల 27 నుంచి విధులు బహష్కరించి ఉద్యమబాట పట్టనున్నట్లు నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంఘం కన్వీనర్ అయిలూరి శ్రీనివాస దీక్షితులు తెలిపారు.

04/17/2016 - 06:07

మడకశిర, ఏప్రిల్ 16: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తూ ప్రజలను, సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు.

04/17/2016 - 06:07

విజయవాడ, ఏప్రిల్ 16: 2018 నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

04/16/2016 - 18:06

విజయవాడ: కృష్ణానది పుష్కరాలు సమీపిస్తున్నందున వివిధ పనులను పూర్తి చేసేందుకు ఎపి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో నదీ తీరం వెంబడి బారికేడ్ల నిర్మాణానికి 9.5 కోట్లు, అతిథిగృహాలు, ప్రభుత్వ బంగ్లాల ఆధునీకరణకు ఆరు కోట్ల రూపాయలను విడుదల చేశారు.

04/16/2016 - 18:05

నెల్లూరు: ఇక్కడి బైపాస్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం వేగంగా దూసుకొచ్చన లారీ ఓ స్కూటీని ఢీకొనడంతో ఎల్‌ఐసి ఏజెంటుగా పనిచేస్తున్న ఓ మహిళ దుర్మరణం పాలైంది. భారీ వాహనాలను నియంత్రించనందునే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

04/16/2016 - 18:05

విజయనగరం: బొబ్బిలి రాజవంశానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే సుజయకృష్ణ, ఆయన సోదరుడు బేబీనాయన ఈనెల 20న తెలుగుదేశంలో పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 20న సిఎం చంద్రబాబు జన్మదినం కావడంతో అదే రోజున బొబ్బిలి రాజులు టిడిపిలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Pages