S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/30/2016 - 04:50

హైదరాబాద్, మార్చి 29:పోలవరం, పట్టిసీమపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ ముఖ్యమంత్రి చంద్రబాబు,విపక్ష నేత జగన్‌ల మధ్య వాడివేడి వ్యక్తిగత ఆరోపణలకు దారితీసింది వాటిలో మచ్చు కు కొన్ని..
జగన్: కెసిఆర్-మహారాష్ట్ర సిఎంతో నీటిపై ఒప్పందాలు కుదుర్చుకుంటే అడ్డుకోవడానికి భయపడ్డావు. కెసిఆర్ అంటే నీకు భయం. ఓటుకు నోటు కేసుతో నీవు భయపడుతున్నావు.

03/30/2016 - 04:46

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో స్థిరమైన, సమ్మిళిత వృద్ధిని సాధించాలనే ధ్యేయంతో నిర్వహణ యాజమాన్య బట్వాడా యూనిట్ (పెమండు)ను అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

03/30/2016 - 04:45

హైదరాబాద్, మార్చి 29: నూతన పర్యాటక విధానాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రాంతీయ టూరిజం హబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకుగాను ఒక్కో హబ్‌కు రూ.1.50 కోట్ల చొప్పున మొత్తం రూ.7.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

03/30/2016 - 04:42

హైదరాబాద్, మార్చి 29: విజయనగరం, మచిలీపట్నం (బందరు) పట్టణాలను మున్సిపల్ కార్పొరేషన్లుగా గుర్తించినట్టు మున్సిపల్ మంత్రి డాక్టర్ పి నారాయణ మంగళవారం నాడు శాసనసభలో చెప్పారు.

03/30/2016 - 03:52

హైదరాబాద్, మార్చి 29 : అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా దేశం వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరిగేందుకు ఏర్పాట్లు జరగడం పట్ల శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్లాఘించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎపి శాసనసభలో మంగళవారం జరిగిన చర్చలో పాల్గొంటూ చంద్రబాబు ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నట్టు గొప్పలు చెబుతోందని, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు.

03/30/2016 - 03:51

హైదరాబాద్, మార్చి 29 : ఆంధ్రప్రదేశ్‌లో కరవు సాయం అందించడంలోనూ కేంద్రం నుండి రాబట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ వైకాపా సభ్యులు మంగళవారం నాడు శాసనసభ నుండి వాకౌట్ చేశారు.

03/30/2016 - 03:49

ఏటా మార్చి నెలలో రాజమహేంద్రవరం వాసులకు సాక్షాత్కరించే సుందర దృశ్యమిది. గోదావరి నదిపై పుష్కరాల రేవు సమీపంలోని పాత రైలు వంతెన (హేవలాక్), కొత్త రైలు వంతెన (బౌ స్ట్రింగ్) వంతెనకు సరిగ్గా మధ్యలో సూర్యాస్తమయం జరుగుతుంది. మార్చి 26 నుండి 30 వరకు ఐదు రోజులు ఈ అద్భుత అస్తమయం ఆవిష్కృతమవుతుంది. మంగళవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో కనిపించిన ఈ అద్భుత అస్తమయాన్ని తిలకించడానికి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.

03/30/2016 - 03:47

రాజమహేంద్రవరం, మార్చి 29: దళారుల బెడద లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మీ సేవ కేంద్రాల వ్యవస్థలో కూడా అర్బన్ ప్రాంతాల ప్రజల దరఖాస్తులు అధిక సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

03/30/2016 - 03:46

గుంటూరు, మార్చి 29: రాజధాని అమరావతి పరిధిలోని లంకభూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే ప్రారంభించారు. కేంద్ర రాజధాని ప్రాంతంలో లంక భూములకు మంచి గిరాకీ ఉండటంతో రైతులు తమ భూములు ఇచ్చిన ప్రదేశంలోనే స్థలాల కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తుళ్లూరు మండలంలోని రాయపూడి, వెంకటపాలెం గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు.

03/30/2016 - 03:45

హైదరాబాద్, మార్చి 29: గోదావరి నదిలో కలిసే జలాలు కాలుష్యం కాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నట్టు పర్యావరణ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు శాసనసభలో వేటుకూరి వెంకట శివరామరాజు, రామాంజనేయులు, ఆకుల సత్యనారాయణ, రామానాయుడు, కాగిత వెంకటరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. గోదావరి బ్యారేజీ కింద ప్రతి కాల్వ కలుషితం అవుతోందని అన్నారు.

Pages