S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/29/2016 - 16:42

హైదరాబాద్: నీటి స్టోరేజీకి అవకాశం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలను వృథా చేసిందని మంగళవారం అసెంబ్లీ సమావేశంలో విపక్షనేత జగన్ ఆరోపించారు. పట్టిసీమ ద్వారా నీళ్లు కిందకు వెళుతున్నాయంటే అందుకు వైఎస్ హయాంలో ప్రారంభించిన పోలవరం కుడికాలువే కారణమన్నారు.

03/29/2016 - 16:40

హైదరాబాద్: అనుకున్న సమయం కంటే ముందుగానే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశామని, ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలకు నష్టం కలుగుతుందన్న అపోహలు అర్థం లేనివని సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. పట్టిసీమపై వైకాపా తప్పుడు ప్రచారం చేసిందన్నారు. నదుల అనుసంధానాన్ని చేతల్లో చూపించిన ఘనత తమకే దక్కిందన్నారు.

03/29/2016 - 16:38

చిత్తూరు: సిసి కెమెరాలను ధ్వంసం చేసి ఓ ఎటిఎంలో నగదు చోరీకి దుండగులు సోమవారం అర్ధరాత్రి విఫలయత్నం చేశారు. గాజులమండ్యంలోని ఇండియావన్ ఎటిఎంలో ఈ ఘటన జరిగింది. ఎటిఎం తెరుచుకోనందున వారు పలాయనం చిత్తగించారు.

03/29/2016 - 16:38

హైదరాబాద్: వైకాపాను వీడాలా? వద్దా? అనే సంశయానికి ఆ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎట్టకేలకు తెర దించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు నెహ్రూ ఓ లేఖను పంపారు. ‘మీరు చెప్పినట్లు నడుచుకోలేక పోతున్నందుకు రాజీనామా చేస్తున్నాన’ని ఆయన పేర్కొన్నారు.

03/29/2016 - 16:35

గుంటూరు: పిడుగురాళ్లకు చెందిన 21 ఏళ్ల యువతిపై సోమవారం రాత్రి అత్యాచారానికి పాల్పడిన రషీద్, రహీం అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితులతో పాటు వెంకటేశ్వర్లు, వెంకటేష్ అనే మరో ఇద్దరు కలిసి యువతిని బలవంతంగా ఆటోలో ఎక్కించి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. తాము అత్యాచారానికి పాల్పడినట్లు రషీద్,రహీం అంగీకరించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

03/29/2016 - 13:06

హైదరాబాద్: భూమా నాగిరెడ్డి తిరిగి టిడిపిలో చేరాక ఇపుడు మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలైనట్లు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. తన వర్గానికి చెందిన సర్పంచ్ తులసిరెడ్డిపై మంగళవారం రాత్రి కత్తులతో దాడి జరిగిందని, ఈ ఘటనకు భూమా కారకుడని ఆయన ఆరోపించారు. తులసిరెడ్డి కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని శిల్పా మోహన్‌రెడ్డి సోదరులు ఈరోజు పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు.

03/29/2016 - 13:05

కడప: శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి ఒంటిమిట్ల కోదండరామ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన మంగళవారం ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించారు. నవమి వేడుకలను ఇక్కడ వేడుకగా జరిపేందుకు టిటిడి తగినంతగా నిధులు మంజూరు చేస్తుందన్నారు.

03/29/2016 - 11:52

కర్నూలు: కొత్తపల్లి సర్పంచ్, టిడిపి నాయకుడు తులసిరెడ్డిపై సోమవారం రాత్రి ఆయన ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆయన ఫోన్‌లో మాట్లాడుతుండగా దుండగులు ప్రవేశించి కళ్లలో కారం చల్లి కత్తులతో గాయపరిచారు. వెంటనే ఆయనను తొలుత కర్నూలు ఆస్పత్రికి ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని, బాగా రక్తస్రావం కావడంతో నీరసించిపోయారని తెలిసింది.

03/29/2016 - 11:51

దిల్లీ: తనను ఎపి అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా చేస్తున్న న్యాయపోరాటం సుప్రీం కోర్టుకు చేరింది. సస్పెన్షన్ సబబే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె మంగళవారం సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.

03/29/2016 - 11:49

కడప: కుటుంబ కలహాల ఫలితంగా తల్లిదండ్రులను దుండగులు హత్య చేయగా ఆ విషాదాన్ని దిగమింగి ఓ టెన్త్ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. కడప జిల్లా మైదుకూరులో ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వెంకటేష్ ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాస్తున్నాడు. తన తల్లిదండ్రులను దుండగులు హత్యచేయడంతో అతను కుంగిపోయాడు.

Pages