S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/29/2016 - 03:55

హైదరాబాద్, మార్చి 28 : ఎపి ప్రభుత్వం ప్రతిపాదించన ఆరు బిల్లులకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో విసి నియామకం, పదవీకాలం పొడిగింపు, విద్యార్థుల సీట్ల కేటాయింపునకు సంబంధించిన బిల్లును ముఖ్యమంత్రి తరఫున ఆర్థిక మంత్రి యనమల ప్రతిపాదించగా సభ ఆమోదించింది.

03/29/2016 - 03:53

హైదరాబాద్, మార్చి 28: తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం నాడు జరగనుంది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరగనున్నాయి. మార్చి 29 నాటికి సరిగ్గా 34 ఏళ్ల క్రితం ఇదే రోజున నందమూరి తారక రామారావు నాయకత్వాన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది.

03/29/2016 - 03:51

హైదరాబాద్, మార్చి 28: విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్ల మండలాలల్లో ఎపిఐఐసి మెసర్స్ బ్రాండిక్స్ ఇండియా అప్పెరల్ సిటీకి కేటాయించిన భూమిలోని 700 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బిజెపి శాసనసభ్యుడు పెనె్మత్స విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర శాసనసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని సభ్యుడు లేవనెత్తారు.

03/29/2016 - 02:31

బుక్కరాయసముద్రం, మార్చి 28: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రోటరీపురం గ్రామ సమీపంలో ఉన్న ఎస్.ఆర్.ఐ.టి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో మెకానికల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ధనరాజ్ (21) మృతి చెందాడు. ఆ సంఘటనకు సంబంధించి పోలీసులు, కళాశాల సిబ్బంది తెలిపిన వివరాలు..

03/29/2016 - 02:30

తెనాలి, మార్చి 28: గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి వంతెన వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఎఎస్‌ఐ డి ప్రసాదరావు కథనం ప్రకారం.. అంగలకుదురు గ్రామానికి చెందిన బి బహదూర్ మూడో కుమారుడు దిలీప్(16) ఈ నెల 21నుండి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు బైకును తానే నడుపుకుంటూ జాగర్లమూడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి వెళ్లి పరీక్షలు రాసి వస్తున్నాడు.

03/29/2016 - 02:29

హైదరాబాద్, మార్చి 28: అగ్రిగోల్డ్ కేసులో బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష వైకాపా సభ్యులు సోమవారం శాసనసభను జరగకుండా అడ్డుకున్నారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను కేవలం గంట వ్యవధిలో రెండుసార్లు వాయిదా వేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే అగ్రిగోల్డ్ కేసులో చర్చించాలని, ఇందుకు తాము ఇస్తున్న వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని ప్రతిపక్షం కోరింది.

03/29/2016 - 02:28

విశాఖపట్నం, మార్చి 28: స్వచ్ఛరైల్ - స్వచ్ఛ్భారత్‌లో రాష్ట్రంలోని మూడు రైల్వేస్టేషన్లలో తిరుపతి మొదటి స్థానంలో నిలిచింది. భారతీయ రైల్వేశాఖ ప్రకటించిన స్వచ్ఛ్భారత్ రైల్వేస్టేషన్లలో తిరుపతి రైల్వేస్టేషన్‌కు 38వ ర్యాంక్ వచ్చింది. వాల్తేరు డివిజన్ పరిధిలోకి వచ్చే విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు 42వ ర్యాంకు లభించగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని విజయవాడ రైల్వేస్టేషన్ 45వ ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

03/29/2016 - 02:23

విజయవాడ, మార్చి 28: రాజధాని నిర్మాణం సమయంలో వ్యవసాయ భూమికి రక్షణ కల్పిస్తూ సింగపూర్ ఇచ్చిన క్యాపిటల్ రీజియన్ ప్రణాళికలో కొన్ని ప్రాంతాలను ఇయర్ మార్క్ చేసింది. అగ్రికల్చర్ ప్రొటక్షన్ జోన్-1, 2, 3గా దీన్ని పేర్కొంది. ఈ జోన్ల ఏర్పాటును స్థానిక రైతులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు కూడా వ్యతిరేకించారు.

03/29/2016 - 02:22

విశాఖపట్నం, మార్చి 28: మధ్యప్రదేశ్, కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి సోమవారం కూడా కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సోమవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది.

03/29/2016 - 02:20

తిరుపతి,మార్చి 28: వ్యవసాయ విద్యలో దూరవిద్యను ప్రవేశపెట్టడంతో ప్రైవేటు కళాశాలల ఏర్పాటుచేయాలని పాలకులు తీసుకున్న నిర్ణయం విద్యార్థులలో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నిరసన దీక్షకు దిగారు.

Pages