S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/16/2015 - 11:49

విజయవాడ: విజయవాడలో కాల్‌మనీ అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో పోలీసులు ఎ.పి.లోని అన్ని జిల్లాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో బుధవారం కూడా సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు, బీమా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేటలో ఇద్దరు, మార్కాపురంలో నలుగురు వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు.

12/15/2015 - 16:35

విజయవాడ : ప్రభుత్వాసుపత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ-ఔషధి ద్వారా వ్యాధులను గుర్తించే అవకాశం ఉన్నందున దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులలో వసతులను మెరుగుపరుస్తామని వెల్లడించారు.

12/15/2015 - 16:34

విజయవాడ : కాల్‌మనీ వ్యవహారంలో నిందితులుగా ఉన్నవారు ఎంతటి పెద్దవారైనా వదిలే ప్రసక్తిలేదని ఏపీ డీజీపీ రాముడు స్పష్టంచేశారు. ఆయన మంగళవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్నవారిని పీడీ యాక్ట్ చట్టం, వడ్డీ కోసం మహిళలను లోబర్చుకున్నవారిపై నిర్భయ చట్టం కింది కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

12/15/2015 - 16:33

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో సెజ్ భూముల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సెజ్ భూముల సరిహద్దురాళ్లను తొలగిస్తూ ఒక్కసారిగా రైతులు చొచ్చుకురావటంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు.

12/15/2015 - 13:17

విజయవాడ : క్యాన్సర్ తో బాధపడుతున్న మస్తాన్ బీ అభిమానిని మంగళవారం ఉదయం యంగ్ హీరో అల్లు అర్జున్ పరామర్శించాడు. విజయవాడ సింగ్ నగర్ లో ఉంటున్న మస్తాన్ బీ 50 ఏళ్లుగా అల్లు రామలింగయ్య అభిమాని. తరువాత అదే కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్‌ను అభిమానిస్తోంది. తన అభిమాన నటుణ్ని ఒక్కసారి ప్రత్యక్షంగా కలవాలని ప్రయత్నిస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...

12/15/2015 - 11:39

విజయనగరం: కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత అన్న తన తమ్ముడు, మరదలిపై యాసిడ్ పోసిన సంఘటన సాలూరు పట్టణంలోని నాయుడు వీధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలిరాజు యాసిడ్ పోయడంతో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ, రాణిలను విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

12/15/2015 - 11:37

విజయవాడ: ఇక్కడ కాల్‌మనీ పేరిట అక్రమాలకు పాల్పడుతున్న వడ్డీ వ్యాపారుల అరాచకాలు బయటపడటంతో ఎ.పి. పోలీసులు రాష్టవ్య్రాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లపై మంగళవారం ఉదయం దాడులు ప్రారంభించారు. విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో వ్యాపారుల ఇళ్లల్లో భారీ ఎత్తున ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

12/15/2015 - 11:36

తిరుమల: తిరుమల దేవస్థానంలో దాతలకు అందించాల్సిన సుమారు 60 వేల లడ్లను టిటిడి ఉద్యోగి ఒకరు కాజేసి బ్లాక్‌లో విక్రయించినట్లు నిఘా విభాగం గుర్తించింది. ఏడాది కాలంగా ఈ అక్రమం జరుగుతున్నట్లు తేలడంతో డోనర్ సెల్‌లో పని చేస్తున్న వెంకటరమణ అనే ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఇవో ఆదేశాలు జారీ చేశారు.

12/15/2015 - 11:34

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవోపేతంగా జరిగింది. ఈ నెల 21న జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 500 మంది సిబ్బందితోపాటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేశారు.

12/14/2015 - 16:23

విజయవాడ : అయుత చండీయాగానికి తనను ఆహ్వానించేందుకు తన నివాసానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చారు. గోంగూర, ఉలవచారు, నాటుకోడి సహా 15 రకాల వంటకాలను విందు కోసం ప్రత్యేకంగా తయారుచేయించారు.

Pages