S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/27/2016 - 01:01

విజయవాడ, మార్చి 26: ఢిల్లీ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ సభ జరిగిన 36 గంటల వ్యవధిలోనే దీనికి పోటీగా అన్నట్లుగా బిజెపి ఆధ్వర్యంలో శనివారం ఉదయం జరిగిన జాతీయ సమైక్యత సభ ఎంతో ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది.

03/26/2016 - 18:47

విజయనగరం: విజయనగరం మాజీ సంస్థానాధీశుడు, మాజీ మంత్రి పూసపాటి ఆనందగజపతి రాజు అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఇక్కడ పూర్తయ్యాయి. ఆయన నివాసం నుంచి మయూరి జంక్షన్ మీదుగా అంతిమయాత్ర సాగింది. కోట సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆనంద్ సోదరుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లాకు చెందిన రాజకీయ నాయకలు, అధికారులు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

03/26/2016 - 17:14

కడప: మూడేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న అంతర్జాతీయ స్మగ్లర్ తేజోవర్మను రైల్వేకోడూరు మండలం దేశెట్టిపల్లిలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతనితో పాటు 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఏడుగురు బిటెక్ విద్యార్థులున్నారు. దాడుల సందర్భంగా భారీగా ఎర్రచందనం దుంగలను, కారుతో పాటు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

03/26/2016 - 17:13

హైదరాబాద్: 333 కోట్ల రూపాయలతో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు మూడేళ్లలో పూర్తవుతాయని, ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన శనివారం ఎపి అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రజల జీవనాన్ని మెరుగుపరచేందుకు టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. సంక్షేమ పథకాల్లో అవినీతిని అరికట్టేందుకు టెక్నాలజీని వాడుతున్నామన్నారు.

03/26/2016 - 17:13

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది, కేశవదాసుపాలెం వద్ద రెండు చోట్ల ఓఎన్‌జిసి పైపులైన్ల నుంచి శనివారం గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్‌జిసి అధికారులు గ్యాస్ లీకేజీని నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్వేది సమీపంలో కరపాక 33వ బావి వద్ద పైప్‌లైన్ పగలడంతో గ్యాస్ ఎగజిమ్ముతోంది. కేశవదాసుపాలెం వద్ద కూడా పైప్‌లైన్ ధ్వంసమైంది.

03/26/2016 - 17:13

కాకినాడ: పెద్దాపురంలోని మున్సిపల్ స్థలంలో నిర్మించిన ఓ ఇంటిని తొలగించేందుకు అధికారులు శనివారం ప్రయత్నించగా ఓ మహిళ తన మెడపై కత్తిపీట పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇంట్లో తలుపు వేసుకుని ఆమె కత్తిపీటను మెడపై పెట్టుకోవడంతో ఒక్కసారి కలకలం రేగింది. ఆమెను బయటకు రప్పించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాలేదు.

03/26/2016 - 12:21

హైదరాబాద్: మూడు రోజుల సెలవుల అనంతరం ఎపి అసెంబ్లీ సమావేశాలు శనివారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్‌లో బడ్జెట్ పద్దులపై చర్చ మొదలైంది. ఈ రోజు సభలో మూడు బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది.

03/26/2016 - 12:23

విజయనగరం: విజయనగరం మాజీ సంస్థానాధీశుడు, మాజీ మంత్రి పూసపాటి ఆనందగజపతి రాజు శనివారం ఉదయం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 1983లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన రాష్ట్ర విద్యాశాఖ, ఆర్థిక శాఖ మంత్రిగాను, రెండుసార్లు బొబ్బిలి ఎంపీగాను సేవలందించారు.

03/26/2016 - 04:02

హైదరాబాద్, మార్చి 25: మరో ఆరు రోజుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో కేంద్ర నిధులపై రాష్ట్ర ఆశలు పెరుగుతున్నాయి.

03/26/2016 - 04:01

విజయవాడ, మార్చి 25: దేశ రాజధాని ఢిల్లీలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎబివిపిని తుడిచిపెట్టి విద్యాసంఘ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడనే కసితో కన్హయ్యకుమార్‌ను అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు బిజెపి మతతత్వ శక్తులు కుట్ర పన్నుతున్నాయంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.

Pages