S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/19/2016 - 06:27

గుంటూరు: జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసులరెడ్డి తనను దైవసాక్షిగా పెళ్లాడి, ప్రస్తుతం తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మోసగిస్తున్నారని విజయవాడకు చెందిన వై.్భవాని ఆరోపించింది. శుక్రవారం మధ్యాహ్నం డిఇఓ కార్యాలయానికి చేరుకున్న భవానీ నేరుగా ఆయన ఛాంబర్‌లోకి వెళ్లటమే కాకుండా బిగ్గరగా కేకలు వేస్తుండటంతో గమనించిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

03/19/2016 - 02:29

హైదరాబాద్, మార్చి 18: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో అత్యవసరమైన పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

03/19/2016 - 02:18

హైదరాబాద్, మార్చి 18: వచ్చే నెలలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న తన కలను సాకారం చేసే ఈ సంస్థకు రాయలసీమ నుండి శ్రీకారం చుడతామని ప్రకటించారు. వ్యవసాయాధారిత పరిశ్రమల సిఇఓలు, రీజనల్ హెడ్స్, ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

03/19/2016 - 02:02

తిరుమల, మార్చి 18: తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి విరాళం ప్రాతిపదికన బంగారు రేకులను తాపడం చేస్తామని టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. తిరుమల్లోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన టిటిడి పాలక మండలి సమావేశం అనంతరం ఆయన బోర్డు నిర్ణయాలను విలేఖరులకు తెలియజేశారు.

03/19/2016 - 01:56

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఎండ మండుతోంది. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలో గడచిన నాలుగైదు రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని యాడికి, బత్తలపల్లి, ఆమడగూరు, నార్పల, పుట్టపర్తి, శింగనమల, గుంతకల్లు, గుత్తి మండలాలతోపాటు మరో40 మండలాల్లో శుక్రవారం 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది.

03/18/2016 - 18:21

చండీగఢ్:ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో తమకు రిజర్వేషన్‌తోపాటు ఏడు డిమాండ్లతో ఆందోళనకు సిద్ధమైన జాట్ సంఘాలతో హర్యానా ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. మార్చినెలాఖరువరకు ఎలాంటి ఆందోళనలు చేపట్టమని, ఏప్రిల్ 3లోగా రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వారు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.

03/18/2016 - 17:12

హైదరాబాద్:ఏపీలో ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియట్‌లో సెకండియర్ ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఉన్నతవిద్యామండలి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, దీనిపై మంత్రిమండలిలో చర్చిస్తామని ఆయన చెప్పారు. 21నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలకోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.

03/18/2016 - 17:05

కొచ్చి:ప్రఖ్యాత మలయాళ నటుడు, గాయకుడు, తెలుగువారికి సుపరిచితుడు అయిన కళాభవన్ మణి (45) ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. మొదట గుండెపోటుతో అతడు మరణించాడని భావించినా కుటుంబ సభ్యులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం అతడి శరీరంలో విషపూరితమైన కొన్ని పురుగుమందుల అవశేషాలున్నట్లు తేలింది. దీంతో కుటుంబ సభ్యుల అనుమానమే నిజమయ్యేట్లు ఉంది.

03/18/2016 - 16:49

హైదరాబాద్: హైకోర్టు తీర్పు ఇచ్చినా ఎమ్మెల్యే రోజాను శాసనసభలోకి అనుమతించకపోవడాన్ని తప్పుబడుతూ ఆ పార్టీ శాసనసభ్యులు రేపు నిరసన వ్యక్తం చేయనున్నారు. నల్లదుస్తులు ధరించి శాసనసభ సమావేశాలకు హాజరవ్వాలని వారు నిర్ణయించారు. రోజాకూడా సమావేశాలకు హాజరవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పన తెలిపారు.

03/18/2016 - 16:48

హైదరాబాద్:వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారంనాడు ధర్మాసనం ఎదుట అప్పీల్ చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. ఆమెను శాసనసభలోకి అనుమతించాలా వద్దా అనే విషయంపై అప్పుడే స్పష్టత వస్తుంది. కాగా శుక్రవారం శాసనసభ ప్రారంభమైన తరువాత సభ్యులకు రోజా సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి హైకోర్టు తీర్పు ప్రతులను అందజేశారు.

Pages