S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/18/2016 - 16:47

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి వైకాపా ఎమ్మెల్యే రోజాను రానివ్వకపోవడంపై ఆ పార్టీ అధినేత, పార్టీ శాసనసభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. రోజాపై సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేసినా శాసనసభలోకి రాన్వికపోవడమేమిటని జగన్ ప్రశ్నించారు. శాసనసభ 3వ గేట్‌నుంచి వచ్చేందుకు రోజా ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో వైకాపా బృందానికి, వారికి వాగ్వాదం జరిగింది.

03/18/2016 - 16:47

న్యూదిల్లి:ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకం విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. విభజనకు ముందు ఉన్న ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తులన్నీ విభజన నేపథ్యంలో తెలంగాణకు చెందుతాయన్న హైకోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపి తీర్పునిచ్చింది.

03/18/2016 - 08:40

సాంకేతికత అందిపుచ్చుకునేందుకు నిర్ణయం

03/18/2016 - 08:38

రాజధాని యువత ఆశలపై నీళ్లుచల్లిన సిఆర్‌డిఏ

03/18/2016 - 08:19

అసెంబ్లీలో గళమెత్తిన విశాఖ నగర ఎమ్మెల్యేలు

03/18/2016 - 08:19

రాష్ట్రంలో 3.47 లక్షల కుక్కలు
విశాఖలో లక్షకు పైగా శునకాలు
మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడి

03/18/2016 - 08:18

హైదరాబాద్, మార్చి 17: సస్పెన్షను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కాపీలను వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ వైఖరిని, శుక్రవారం నాడు శాసనసభలో అనుసరించాల్సిన వైఖరిని చర్చించారు. పార్టీ అధినేత జగన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో సమావేశమై ప్రభుత్వ వైఖరి, సాంకేతిక ఇబ్బందులతో పాటు పార్టీ వైఖరిపై అభిప్రాయ సేకరణ చేశారు.

03/18/2016 - 08:18

సాధ్యం కాదన్న మంత్రి బొజ్జల

03/17/2016 - 18:39

న్యూదిల్లి:ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో మోదీ ఇంటర్నెట్ స్టార్‌గా టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. 30మంది పేర్లతో ఆ సంస్థ విడుదల చేసిన జాబితాలో మోదీకి వరుసగా రెండో సంవత్సరంకూడా చోటుదక్కింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, సాకర్ క్రీడాకారుడు క్రిస్టియానారొనాల్డో సహా పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

03/17/2016 - 17:37

విశాఖపట్నం: తక్కువ ధరకే ఫోన్, ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను అందించే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు విశాఖలో గురువారంనాడు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సిస్కో చైర్మన్ జాన్‌టిచాంబర్స్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన బాబు ఫైబర్‌గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టారు. సమాచార, ప్రసారం రూపురేఖలు మార్చే ప్రాజెక్టుగా దీనిని భావిస్తున్నారు.

Pages