S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/12/2016 - 17:51

విజయవాడ: కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలోని ఓ పొలంలో బోరుబావి నుంచి గ్యాస్, నీళ్లు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. నీళ్లు సరిగా రాలేదని శనివారం ఈ బోరు బావిని 150 అడుగుల లోతున తవ్వించినట్లు పొలం యజమాని తెలిపారు. గ్యాస్‌ను అరికట్టేలా చర్యలు తీసుకునేందుకు అధికారులు యంత్రాలను రప్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో గ్యాస్ ఇలా రావడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

03/12/2016 - 17:03

హైదరాబాద్: మూడేళ్ల తర్వాత ఎపి సిఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టడం ఖాయమని, 30 ఏళ్ల పాటు ఆయనే రాష్ట్రాన్ని పాలిస్తారని వైకాపా నేత, సినీనటి రోజా అన్నారు. వైకాపా ఆవిర్భావ దినం సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. జనం మద్దతుతో జగన్ సిఎం కావడం ఖాయమన్నారు.

03/12/2016 - 16:59

గుంటూరు: పొన్నూరు మండలం కసుకర్రులో అమూల్య అనే ఇంజనీరింగ్ విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకుంది. చీరాలలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఆమె చదువుతూ స్వగ్రామానికి వచ్చింది. ప్రేమ వేధింపులే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమని అమూల్య తల్లిదండ్రులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

03/12/2016 - 13:58

విజయవాడ: కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో 241 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆయన శనివారం ఇక్కడి దుర్గగుడి నుంచి ఇబ్రహీంపట్నం వరకూ పుష్కర ఘాట్ల పనుల తీరును పరిశీలించారు. అన్ని పనులనూ సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

03/12/2016 - 13:58

అనంతపురం: ఆడశిశువును గొంతు నులిమి కన్నతల్లే చంపేసిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. ముదిరెడ్డిపల్లెకు చెందిన కళావతి, గంగాధర్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. మూడో కాన్పులో మగబిడ్డ పుట్టినా బతకలేదు. నాల్గో కాన్పులో మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో కళావతి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. శిశువుకు వైద్యం చేయిస్తానన్న నెపంతో ఆమె హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది.

03/12/2016 - 13:57

కాకినాడ: అన్నవరం ఆలయ పరిసరాల్లో ఓ వివాహ వేడుక సందర్భంగా శనివారం తెల్లవారు జామున కొందరు మద్యం మత్తులో చిందులు వేయడం, అశ్లీల నృత్యాలు ప్రదర్శించడంపై ఆలయ ఇఓ స్పందించారు. ఇందుకు సంబంధించి నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. మందు పార్టీ, అశ్లీల నృత్యాల్లో పాల్గొన్న పెళ్లిబృందానికి కూడా ఇవో నోటీసులు ఇచ్చారు.

03/12/2016 - 13:57

అనంతపురం: కాపుగర్జన సందర్భంగా తునిలో జరిగిన విధ్వంసకాండలో వైకాపా నేత భూమన కరుణాకర రెడ్డికి ప్రమేయం ఉందా? లేదా? అనే అంశంపై సిఐడి దర్యాప్తు చేస్తోందని ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం ఇక్కడ మీడియాతో అన్నారు. సిఐడి దర్యాప్తులో దోషులుగా తేలినవారిపై చట్టపరంగా శిక్షలు పడతాయన్నారు. కాగా, మాజీ మంత్రి ముద్రగడ చేస్తున్న దీక్షలను తమ ప్రభుత్వం పట్టించుకోదన్నారు.

03/12/2016 - 12:11

శ్రీకాకుళం: శ్రీకాకుళం- ఒడిశా సరిహద్దులో ఇచ్ఛాపురం వద్ద ఇంటెగ్రేటెడ్ చెక్‌పోస్టులో ఎసిబి అధికారులు శనివారం నాలుగున్నర గంటల నుంచి తనిఖీలు చేసి లెక్కతేలకుండా ఉన్న సుమారు 76 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి డిఎస్పీ రంగరాజు నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి.

03/12/2016 - 12:03

విశాఖ: ఎపికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎపి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఛలోదిల్లీ ఆందోళన చేపట్టారు. ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం విశాఖ నుంచి దిల్లీకి బయలుదేరారు.

03/12/2016 - 12:02

కడప: రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఫారెస్టు, పోలీసు సిబ్బంది కూంబింగ్ జరిపి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న కోటి రూపాయల విలువైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నిల్వ చేసిన వారి కోసం గాలిస్తున్నారు.

Pages