S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/11/2016 - 17:50

హైదరాబాద్: ఏపిలో విపక్ష ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకుంటున్నట్లే తెలంగాణలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని టి.మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. తెరాసలో టిడిపి ఎమ్మెల్యేల విలీనంపై విపక్షనేత రేవంత్ రెడ్డి చెబుతున్న మాటల్లో అర్థం లేదన్నారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దించనపుడు చంద్రబాబు వెంట ఇలాగే ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని ఆయన గుర్తు చేశారు.

03/11/2016 - 16:42

అనంతపురం: ధర్మవరం కొత్తపేటలో సత్యసాయి బాబా ఫొటో నుంచి విభూది రాలుతోంది. ఈ వింతను చూసేందుకు జనాలు బారులు తీరుతున్నారు. ఇవన్నీ బాబా మహిమలేనని భక్తులు చెబుతున్నారు.

03/11/2016 - 16:08

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి (ఇఓ)గా చంద్రశేఖర ఆజాద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అర్చకులతో వివాదం ఫలితంగా ఇఓ నరసింగరావును సెలవుపై వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆజాద్ బాధ్యతలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఆలయంలో అర్చకుల వివాదం సమసిపోయినట్లేనని, అందరినీ కలుపుకుని పోతూ తాను పనిచేస్తానని తెలిపారు.

03/11/2016 - 13:16

విజయవాడ: అనేక అవినీతి ఆరోపణలున్నందున ఇక్కడి దుర్గగుడి ఇఓ నరసింగరావును సస్పెండ్ చేయాలని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ డిమాండ్ చేశారు. ఇఓ ప్రవర్తన వల్ల ఆస్పత్రి పాలైన అర్చకుడు సుబ్బారావును శుక్రవారం ఉదయం దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే ఉమ పరామర్శించారు. అంతర్గత బదిలీలకు ఇఓ లంచాలు గుంజుతున్నట్లు తెలిసిందని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రిని ఉమ కోరారు.

03/11/2016 - 13:16

విజయవాడ: భర్త వేధింపుల నుంచి తనను కాపాడాలని కోరినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ దుర్గ అనే వివాహిత శుక్రవారం ఇక్కడి కొత్తపేట పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా ప్రారంభించింది. తనకు న్యాయం జరిగే వరకూ ఆందోళన చేస్తానని ఆమె చెబుతోంది. పోలీసు స్టేషన్ మీదుగా వెళుతున్న మంత్రి పుల్లారావ్ కాన్వాయ్‌ను ఆమె అడ్డుకుంది.

03/11/2016 - 13:15

చిత్తూరు: కుమారుడితో పాటు బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లి మండలం కోళ్లబయలులో శుక్రవారం జరిగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీసి, ఆత్మహత్యలకు దారితీసిన కారణాల గురించి ఆరా తీస్తున్నారు.

03/11/2016 - 11:45

తిరుమల: తిరుమలలో వెయ్యికాళ్ల మండపం నిర్మాణానికి మళ్లీ అంతరాయం కలిగింది. 2003లో వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించాక, ప్రధాన ఆలయం ఎదుటే దాన్ని నిర్మించాలని గతంలో కొందరు హైకోర్టును ఆదేశించారు. పాత స్థలంలోనే మండపాన్ని నిర్మించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, నారాయణగిరి ఉద్యానవనంలో 19 కోట్లతో మండపం పనులను టిటిడి చేపట్టింది.

03/11/2016 - 11:44

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామికి విశాఖకు చెందిన శ్రీమిత్రా ఇన్‌ఫ్రా అధినేత పి.శ్రీనివాసరావుకోటి రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో శుక్రవారం ఉదయం టిటిడి బోర్డు అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు. ఈ విరాళాన్ని నిత్యాన్నదాన సేవకు వినియోగించాలని దాత కోరారు.

03/11/2016 - 11:44

విజయవాడ: మైలవరం మండలం కొత్తగూడెం గ్రామంలో రేషన్ దుకాణాల నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల బియ్యాన్ని మార్కెట్ కమిటీ సభ్యులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.

03/11/2016 - 11:42

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో అర్చకులు ఆందోళన విరమించి శుక్రవారం ఉదయం నుంచి విధులకు హాజరవుతున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న ఆలయ ఇఓ నర్సింగరావును సస్పెండ్ చేయాలని అర్చకులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల31 వరకూ ఇఓ సెలవుపై వెళ్లడంతో అర్చకులు తాత్కాలింగా తన ఆందోళన విరమించారు.

Pages