S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/01/2016 - 07:20

కాపులను బీసీల్లో చేరుస్తారా? లేదా? అంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం

02/01/2016 - 07:46

కాకినాడ, జనవరి 31: కాపులను బీసీల్లో చేరుస్తూ 24 గంటల్లోగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, లేనిపక్షంలో తాను ఆమరణ దీక్షకు దిగుతానని మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అల్టిమేటం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం కాపుగర్జన వేదిక నుండి కిందకు దిగి, జాతీయ రహదారిపై బైఠాయించిన ముద్రగడ రాత్రి 10 గంటలకు ఆందోళన విరమించారు.

02/01/2016 - 04:09

విజయవాడ, జనవరి 31: తూర్పు గోదావరి జిల్లా తుని కాపుగర్జన సభలో చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ ఘటన వెనుక రాజకీయ ముసుగులో నేరస్థుల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఇలాంటి ఘటన ఏ పులివెందులలో జరిగి ఉంటే ఆశ్చర్యముండేది కాదని, ప్రశాంత వాతావరణం నెలకొని ఉండే గోదావరి జిల్లాల్లో ఇలాంటివి జరగడం బాధాకరమన్నారు.

02/01/2016 - 04:06

విశాఖపట్నం, జనవరి 31: రాష్ట్రంలో ఖాళీగావున్న 8086 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కోర్టు వివాదాల కారణంగా డిఎస్సీకి జాప్యం జరిగిందన్నారు. ఆదివారం ఇక్కడ సర్క్యూట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్సీ షెడ్యూల్‌ను వెల్లడించారు.

02/01/2016 - 04:03

హైదరాబాద్/ రాజమండ్రి/ విశాఖపట్నం, జనవరి 31: తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును కాపు గర్జన ఆందోళనకారులు దగ్ధం చేయడంతో హౌరా- చెన్నై ప్రధాన రూట్లో రైళ్ల రాకపోకలు స్ధంభించాయి. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా దగ్ధం కావడంతోపాటు రైల్వే సిగ్నల్, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.

02/01/2016 - 04:02

హైదరాబాద్, జనవరి 31:తుని సంఘటన మరోసారి ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. జరగబోయే పరిణామాలను అంచనా వేయడంలోనూ, తదనుగుణంగా చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వపరంగా జరిగిన తప్పిదాల్లో గత ఏడాదిన్నర కాలంలో ఇది రెండవదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పుష్కరఘాట్ ప్రమాదం మొదటిది కాగా తుని సంఘటన రెండోది. కాపుఐక్య గర్జన హింసాత్మకంగా మారకుండా అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

01/31/2016 - 21:27

విజయవాడ: తునిలో కాపుఐక్యగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసం, దాడులు అత్యంత బాధాకరమని, తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే ప్రధమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న కొందరు వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

01/31/2016 - 21:07

తుని-తునిలో నిర్వహించిన కాపుఐక్యగర్జన, అనంతర పరిణామాలపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, మంత్రులతో సమీక్షించారు. కాపుగర్జన సందర్భంగా తలెత్తే పరిణామాలను ముందుగానే ఎందుకు అంచనావేయలేకపోయారని, ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులు, నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

01/31/2016 - 20:51

హైదరాబాద్: కాపుగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసం, దాడుల వెనుక వైకాప హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. కాపులను బిసిలుగా గుర్తించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే రాజకీయంగా ఈ పరిణామాలను సహించలేని వైకాపా కాపుగర్జన సందర్భంగా ఉద్రిక్తత రగిలేలా చర్యలకు పాల్పడిందని టిడిపి ఆరోపించింది.

01/31/2016 - 18:12

విశాఖపట్నం : తునిలో జరుగుతున్న కాపు సామాజికవర్గ కార్యకర్తల ఆందోళనకారంగా రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి. భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆదివారం సాయంత్రం విశాఖనుంచి బయలుదేరాల్సి ఉండగా నిలిపివేశారు. తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టడంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి ఇప్పటికిప్పుడు మారే సూచనలు కన్పించడం లేదు.

Pages