S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/10/2016 - 18:48

హైదరాబాద్: ఎపి శాసనసభలో గురువారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వార్షిక బడ్జెట్‌ను, వ్యవసాయ మంత్రి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్‌ను చదివి వినిపించాక సభను స్పీకర్ కోడెల సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం నుంచి బడ్జెట్‌పై చర్చ జరిగే అవకాశం ఉంది.

03/10/2016 - 17:16

శ్రీహరికోట:్భరత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయం నమోదు చేసింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌నుంచి గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగిన పిఎస్‌ఎల్‌వి - సి32 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ వాహకనౌకతోపాటు ప్రయోగించిన ఐఆర్‌ఎస్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరింది. ఈ తరహా ప్రయోగాల పరంపరలో ఇది ఆరవది.

03/10/2016 - 17:16

కిర్లంపూడి:కాపు సామాజిక వర్గాన్ని బిసి జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో రేపటినుంచి చేపట్టాల్సిన ఆమరణదీక్షను రెండుమూడు నెలలు వాయిదావేసినట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

03/10/2016 - 11:52

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో అర్చకులు గురువారం ఉదయం ఆందోళన ప్రారంభించారు. ఆలయ ఇ.వో నియంతలా వ్యవహరిస్తూ తమను వేధింపులకు గురిచేస్తున్నాడని అర్చకులు ఆరోపిస్తూ మూకుమ్మడిగా విధులను బహిష్కరించారు. ఇ.వో ప్రవర్తన వల్ల సుబ్బారావు అనే అర్చకుడు అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిపోయినట్లు వారు చెబుతున్నారు. ఇ.వోను వెంటనే సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు.

03/10/2016 - 11:51

హైదరాబాద్: నిరుద్యోగ భృతి, ఉపాధి విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఎపీ అసెంబ్లీలో గురువారం ఉదయం వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. విపక్షనేత వైఎస్ జగన్ మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి ఇస్తారని ఆశించిన యువకులు నిరాశలో మునిగిపోయారని, డిఎస్సీ పరీక్ష జరిగి నెలలు గడిచినా టీచర్ల నియామకాలు జరగలేదని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడం లేదని అన్నారు.

03/10/2016 - 11:50

హైదరాబాద్: 2016-17 వార్షిక బడ్జెట్‌కు ఎపి మంత్రిమండలి గురువారం ఉదయం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్థికమంత్రి యనమల, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో చర్చకు యనమల ప్రవేశపెడతారు.

03/10/2016 - 11:49

అనంతపురం: ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బాలఅరుణమ్మ (34) ఆత్మహత్య చేసుకున్న ఉదంతం గురువారం ఉదయం వెలుగు చూసింది. ధర్మవరంలోని యాదవవీధిలో నివసిస్తున్న ఆమె కుటుంబ కలహాల ఫలితంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఆమె సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

03/10/2016 - 07:31

హైదరాబాద్: విమ్స్ ఆస్పత్రిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలోకి తీసుకువచ్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా అభివృద్ధి చేస్తామని ఆరోగ్య, వైద్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. బుధవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో కిడారి సర్వేశ్వరరావు, విష్ణుకుమార్‌రాజు, రాజన్నదొర, రామకృష్ణబాబు, కళావతి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

03/10/2016 - 07:30

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరాతి నిర్మాణానికి ఇంతవరకూ ప్రభుత్వం 34,142.74 ఎకరాల భూమిని సేకరించిందని, అందులో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిందే 28,264 ఎకరాలు ఉందని మున్సిపల్ మంత్రి డాక్టర్ పి నారాయణ చెప్పారు. బుధవారం శాసనసభలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇంతవరకూ భూ సమీకరణకు 94 శాతం రైతులు అంగీకరించారని అన్నారు.

03/10/2016 - 07:16

కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి గురువారం సాయంత్రంలోగా కాపుల సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ రాని పక్షంలో ఈనెల 11వ తేదీ నుండి మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సన్నద్ధమవుతున్నారు. ఈమేరకు కిర్లంపూడిలోని తన నివాసంలో గురువారం 13 జిల్లాల కాపు నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

Pages