S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/09/2016 - 19:34

ధర్మశాల:టి-20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ తొలి పోటీలో బంగ్లాదేశ్ జట్టు విజయంతో బోణీ కొట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో బుధవారం నేదర్లాండ్స్‌తో జరిగిన పోటీలో బంగ్లాదేశ్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్న బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది.

03/09/2016 - 17:47

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి తీరతామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై మంత్రి దేవినేని, జగన్ మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నెలకొంది. మంత్రి దేవినేని స్పందిస్తూ పట్టిసీమ ద్వారా గోదావరి జిలాలను తరలించి కృష్ణా డెల్టాలో పంటను కాపాడామన్నారు. వైఎస్‌ హయాంలో జలయజ్ఞం పేరుతో వేలకోట్లు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు.

03/09/2016 - 17:39

హైదరాబాద్‌: అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీలో 10.99శాతం అభివృద్ది సాధిస్తే... తెలంగాణలో 9.24శాతమే నమోదైందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి హామీలన్నీ సాధించుకుంటామన్నారు.

03/09/2016 - 17:36

హైదరాబాద్: సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వైకాపా ఎమ్మెల్యేలను ఈరోజుకు సస్పెండ్ చేస్తున్నట్లు ఎపి అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం ప్రకటించారు. వైకాపా సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించిన తీర్మానాన్ని సభలో ఆమోదించారు. సస్పెండైన వైకాపా ఎమ్మెల్యేలు..

03/09/2016 - 12:06

విశాఖ: సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం ఉదయం విశాఖ, కళింగపట్నం, కృష్ణపట్నం తదితర సాగర తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గ్రహణం విడుపు అనంతరం సముద్ర స్నానం చేస్తే దోషాలు తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం. విశాఖ ఆర్‌కె బీచ్‌లో స్నానాలు చేసేందుకు భారీ సంఖ్యలో మహిళలు చేరుకున్నారు.

03/09/2016 - 12:05

హైదరాబాద్: గోదావరి నదిపై ఐదు ప్రాజెక్టులు నిర్మించేందుకు మహరాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి దేవినేని ఉమ బుధవారం చెప్పారు.

03/09/2016 - 12:03

ఒంగోలు: ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. పొన్నలూరు మండలం విప్పగుంట వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

03/09/2016 - 12:03

చిత్తూరు: ఇద్దరు పిల్లలతో గృహిణి ఆత్మహత్యా యత్నం చేసుకొన్న సంఘటన పుంగలూరు మండలం మంగళం కాలనీలో బుధవారం జరిగింది. స్థానికులు వెంటనే గమనించి ఈ ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

03/09/2016 - 12:02

విశాఖ: విశాఖ ఏజెన్సీలోని సీలేరు ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేసి కోటి రూపాయల విలువచేసే 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

03/09/2016 - 12:02

శ్రీకాకుళం: విదేశీ జీడిపిక్కల దిగుమతిపై 9.36 శాతం పన్ను విధించటాన్ని వ్యతిరేకిస్తూ పలాస ప్రాంతంలో బుధవారం జీడి పరిశ్రమల యజమానులు బంద్ పాటిస్తున్నారు. దాదాపు 150 జీడిపప్పు పరిశ్రమలు మూతపడ్డాయి.

Pages