S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/04/2016 - 11:58

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ రైతు నుంచి 30వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ధర్మవరం సర్వేయర్ చండ్రాయుడిని గురువారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. సర్వేయర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

02/04/2016 - 11:57

కర్నూలు: ఫేస్‌బుక్ ద్వారా పరిచయాలు పెంచుకొని యువతులను అశ్లీలంగా చిత్రిస్తున్న ఓ ఆర్‌ఎంపి వైద్యుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. రాజ్‌కుమార్ అనే ఈ నిందితుడు ఇద్దరు యువతులను లాడ్జీలకు రప్పించి వారిని నగ్నంగా ఫొటోలు తీసి డబ్బు, నగలు ఇవ్వాలని బెదిరించాడు. నిందితుడి నుంచి 20 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

02/04/2016 - 11:57

విజయవాడ: ఎ.పి. రాజధాని అమరావతి ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణానికి ఈ నెల 12న తెల్లవారుజామున 4.15 ని.లకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 180 కోట్ల రూపాయలతో నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

02/04/2016 - 11:55

విజయవాడ: బోగీలు సమస్య ఎదురుకావటంతో విజయవాడ - విశాఖ మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను నడపటం రైల్వే అధికారులకు సమస్యగా మారింది. కాపు గర్జన ఆందోళన సందర్భంగా గత ఆదివారం రత్నాచల్‌లోని మొత్తం 24 బోగీలు దగ్ధం కావటంతో కొత్త బోగీలను సమకూర్చుకోవటం రైల్వే అధికారులకు సవాలుగా మారింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో అన్నీ చైర్ కార్ బోగీలే అవసరం కనుక, వాటిని సమకూర్చాలని అధికారులు వేరే బోర్డుకు లేఖ రాశారు.

02/04/2016 - 07:58

హైదరాబళాద్: కాపులను బిసి జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ 4వ తేదీ గురువారం ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాలని బిసి సంఘాలకు బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. త్వరలో విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కాపులను బిసి జాబితాలో కలపాలని కోరడం తగదన్నారు.

02/04/2016 - 07:58

తిరుమల: శ్రీవారిని దర్శిస్తే తనలో నూతనోత్సాహం నిండుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. రెండవ పర్యాయం బిజెపి జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ఆయన బుధవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఆలయానికి చేరుకున్న ఆయనకు టిటిడి చైర్మన్, ఈవో, జె ఈవోలు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.

02/04/2016 - 07:57

ఆదోని టౌన్: రాష్ట్రంలోని బ్రాహ్మణులంతా ఏకమై ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రాలయం మఠం ప్రతినిధి గిరిరాజాచార్యులు అన్నారు. ఇందుకు మంత్రాలయం మఠం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి బ్రాహ్మణుల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

02/04/2016 - 07:56

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల నియామకానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. టెట్ కం టిఆర్‌టి -2014 మార్కుల జాబితాలను కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ పోర్టల్‌లో ఉంచింది. తొలి దశలో టెట్ మార్కుల జాబితాతో పాటు ఎస్‌జిటిలు, పండిట్‌ల వివరాలను ఉంచింది. రెండు మూడు రోజుల్లో స్కూల్ అసిస్టెంట్ల జాబితాలను కూడా ఉంచుతారు. 5వ తేదీన సిజిజి ద్వారా సెలక్షన్ లిస్టులను రూపొందిస్తారు.

02/04/2016 - 07:55

హైదరాబాద్: ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించి ఒక కేసు విషయమై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనందుకు ఏపి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి మూడు వేల రూపాయల జరిమానా విధిస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీంకు సంబంధించి జరీబు భూములకు నిర్వచనం ఇవ్వాల్సిందిగా కె ఓంకార్ తదితరులు రెండు పిటిషన్లను దాఖలు చేశారు.

02/03/2016 - 18:51

కిర్లంపూడి : కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడివర్గంగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాలన్న లక్ష్యంతో ఎల్లుండి ఉదయం 9 గంటలనుంచి తన భార్యతో కలసి ఆమరదీక్ష చేపట్టనున్నట్లు కాపునేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తునిలో కాపుఐక్యగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసం సంఘవిద్రోహశక్తుల పనేనని ఆయన తెలిపారు. కిర్లంపూడిలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

Pages