S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/03/2016 - 11:46

తుని: కాపులను బిసి జాబితాలో చేర్చటంతోపాటు ఇతర న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించేందుకు తాను సతీ సమేతంగా ఈ నెల 5వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడతానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం ఇక్కడ మీడియాతో చెప్పారు. కాపు గర్జన సందర్భంగా తునిలో జరిగిన విధ్వంస కాండకు సంబంధించి ఆందోళనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

02/03/2016 - 07:19

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 2: కాపు ఐక్య గర్జన సందర్భంగా ఆందోళనకారులు నిప్పంటించిన నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కే పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆందోళనకారులు నిప్పటించటంతో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో తగులబడ్డ నాలుగు బోగీల్లో, రెండు బోగీల్లోని ఇంటీరియర్ నిర్మాణం పూర్తి ధ్వంసమయింది. మిగిలిన రెండు బోగీల్లోని ఇంటీరియర్ పాక్షికంగా దెబ్బతింది.

02/03/2016 - 07:18

విజయవాడ, ఫిబ్రవరి 2: విజయవాడ కథోలిక పీఠం 6వ బిషప్‌గా నియమితులైన తెలగతోటి జోసఫ్ రాజారావు అభిషేక ప్రతిష్ఠోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం గుణదల బిషప్ గ్రాసి హైస్కూల్ ప్రాంగణంలో కనుల పండువగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్చి బిషప్‌లు, బిషప్‌లు, గురువులు హాజరయ్యారు. ఇండో-నేపాల్ పోప్ రాయబారి న్యూఢిల్లీ ఆర్ట్ బిషప్ సాల్వేతోర్ పెనాకియో ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

02/03/2016 - 07:17

విజయవాడ, ఫిబ్రవరి 2: రిజర్వేషన్లు పొందిన కులాలు గతంలో ఏ పద్ధతిలో పొందాయో రాష్ట్రంలోని కాపు మేధావులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ కోరారు. ఇదే సందర్భంలో జీవోనెం.30పై కూడా అధ్యయనం చేసి వాస్తవాలను కాపులకు తెలియజేయాలని కోరారు.

02/03/2016 - 07:17

గుంటూరు, ఫిబ్రవరి 2: రాష్ట్ర శాసన సభాపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న కోడెల శివప్రసాదరావు జీవితమంతా నేరమయమని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. జిల్లా వైకాపా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ మహమ్మద్ ముస్త్ఫా, కావటి మనోహర్‌నాయుడు, కొత్త చిన్నపరెడ్డి మాట్లాడారు.

02/03/2016 - 07:16

కాకినాడ, ఫిబ్రవరి 2: తునిలో కాపు ఐక్య గర్జన నేపథ్యంలో జరిగిన విధ్వంసంలో రైల్వే శాఖకు సుమారు 100 కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలిసింది. రైల్వే శాఖకు చెందిన ప్రత్యేక అధికారుల బృందం అగ్నికి ఆహుతైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు సహా విధ్వంసానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించింది.

02/03/2016 - 04:28

అనంతపురం, ఫిబ్రవరి 2: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రపంచమంతా గుర్తించి అభినందనలు తెలుపుతుంటే ప్రధాని మోదీ మాత్రం దీన్ని యుపిఎ ప్రవేశపెట్టిన బేకార్ పథకంగా పేర్కొనడం విడ్డూరంగా ఉందని, పేదల పట్ల ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఉన్న విజన్‌కు ఇది నిదర్శనమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. అందుకే ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా నీరుగార్చే పన్నాగం పన్నారన్నారు.

02/03/2016 - 04:26

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 2: కాపు ఐక్య గర్జన సందర్భంగా తుని వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పటించిన సంఘటనకు బాధ్యులుగా ఇప్పటి వరకు 45మందిని రైల్వే అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. రైల్వే భద్రతా దళాలు తమకు లభించిన సమాచారం, ఆధారాలతో కొంతవరకు కీలకమైన సమాచారాన్ని రాబట్టగలిగారు.

02/03/2016 - 04:18

హైదరాబాద్, ఫిబ్రవరి 2: నవ్యాంధ్ర రాజధాని అమరావతి బృహత్ ప్రణాళికకు తుది రూపాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సింగపూర్ బృందంతో మరోమారు చంద్రబాబునాయుడు బుధవారం చర్చలు జరపనున్నారు. రాజధాని పరిధిలోకి వచ్చే గ్రామస్తులతో కూడా చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతారు. ఇప్పటికే గ్రామస్తుల అభ్యంతరాలు, ప్రభుత్వ వైఖరిపై స్పష్టమైన నివేదికలను సిఆర్‌డిఎ అధికారులు సిద్ధం చేశారు.

02/03/2016 - 04:15

కాకినాడ, ఫిబ్రవరి 2: తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జనలో హింసను ప్రేరేపించిన, పాల్పడిన నిందితులపై కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. మంగళవారం పొద్దుపోయే సమయానికి వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 60 మందిపై కేసులు నమోదయ్యాయి.

Pages