S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/02/2016 - 05:33

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ‘ముద్రగడ.. ముద్రగడ..’ రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు పొరుగు రాష్ట్రాల్లోనూ మారుమోగుతున్న పేరు ఇది. రెండు రోజులుగా ఏపి ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన ముద్రగడ పద్మనాభం రెండు దశాబ్దాల కిందట రాష్ట్ర రాజకీయాలను శాసించి చెరగని ముద్రవేశారు.

02/02/2016 - 05:28

హైదరాబాద్, ఫిబ్రవరి 1: కాపులకు బిసి కోటాలో రిజర్వేషన్లు కల్పిస్తే ఉద్యమిస్తామని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టిడిడి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో మీడి యా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రస్తుతం బిసిలకు లభిస్తున్న రిజర్వేషన్లలో అన్యాయం జరిగితే మిన్నకుండా ఉండేప్రసక్తే లేదన్నారు. కాపు లు ఆందోళన చేయగానే రిజర్వేషన్లు కల్పిస్తారా అంటూ ప్రశ్నించారు.

02/02/2016 - 05:25

హైదరాబాద్, ఫిబ్రవరి 1: కాపులకు రిజర్వేషన్లు కల్పించేదీ లేనిదీ స్పష్టం గా చెప్పాలని, వారిని మీమాంసలో పెట్టడం సరికాదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.

02/02/2016 - 00:49

కాకినాడ, ఫిబ్రవరి 1: కాపులను బీసీలుగా గుర్తించి తక్షణం రూ.1900 కోట్లు కాపుల సంక్షేమ కార్పొరేషన్‌కు కేటాయించని పక్షంలో 5నుంచి భార్య పద్మావతితోపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తనను అరెస్టు చేయడానికి కుట్ర జరుగుతోందని, తనను, తన భార్యను జైలులో నిర్బంధించినా అక్కడా నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు. బెయిలు కోసం ప్రయత్నించేది లేదన్నారు.

02/02/2016 - 00:47

కాకినాడ, ఫిబ్రవరి 1: కాపులను బీసీలుగా గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కారణంతో ఓ వ్యక్తి తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన తీవ్ర కలకలం రేపింది. కాకినాడ డైరీఫారం సెంటర్ సమీపంలో రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసిస్తున్న చీకట్ల వెంకట రమణమూర్తి (51) సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌కు చేరుకున్నాడు.

02/02/2016 - 00:44

విజయవాడ, ఫిబ్రవరి 1: కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉందని, అయితే నామమాత్రంగా కాకుండా చట్టబద్ధత కల్పించడమే ప్రధాన లక్ష్యమని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు ఏర్పాటు చేసిన కమిషన్‌కు సిఫార్సు చేసేందుకే జారీ చేసిన జీవో 30 ఇప్పటికీ అమల్లోనే ఉందని, ఇది ప్రభుత్వ మనోగతానికి నిదర్శనమన్నారు.

02/02/2016 - 00:42

అనంతపురం, ఫిబ్రవరి 1: గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏడాదికి 100 రోజులు కనీస ఉపాధి కల్పించాలన్న బృహత్ లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మంగళవారంతో 10 ఏళ్లు పూర్తవుతాయి. కాంగ్రెస్ సారథ్యంలోని నాటి యుపిఏ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మక రీతిలో పథకాన్ని చేపట్టి గ్రామీణ కుటుంబాలకు, ముఖ్యంగా రైతులకు ఆర్థిక బాసట కల్పించింది.

02/02/2016 - 00:38

హైదరాబాద్, ఫిబ్రవరి 1: రాజకీయ స్వప్రయోజనాల కోసం సిఎం చంద్రబాబే ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొడుతున్నారని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ లేనంతగా బాబు దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్ల శాతం పెంచి, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలు ఎందుకు ఒప్పుకోరని ప్రశ్నించారు.

02/02/2016 - 00:33

కాకినాడ, ఫిబ్రవరి 1: తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన సందర్భంగా ఆదివారం జరిగిన విధ్వంసం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లింది. కాపుల ఐక్య గర్జన ఆద్యంతం ప్రశాంతంగా జరుగుతుందని ఆశించిన వారికి ఈ పరిణామం తీవ్ర బాధనే మిగిల్చింది.

02/01/2016 - 18:30

కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ల కోసం తాము నాలుగు రోజుల తర్వాత కిర్లంపూడిలోని తన ఇంట్లోనే ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం ప్రకటించారు. భార్యతో కలిసి దీక్ష మొదలు పెడతానని, ఆందోళనకారులు ఎవరికివారు తమ ఇళ్లలో దీక్షలు చేయాలన్నారు. అందరూ కిర్లంపూడికి రావాల్సిన అవసరం లేదని, శాంతియుతంగానే ఉద్యమం కొనసాగించాలన్నారు.

Pages