S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/31/2015 - 13:55

విశాఖపట్నం : సందర్శుకుల రద్దీ దృష్ట్యా జనవరి 2,3 తేదీల్లో విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జి తెలిపారు. సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంటే వారం రోజులపాటు ప్రత్యేక రైళ్లను నడుపుతామని ఆయన చెప్పారు.

12/31/2015 - 13:45

విజయవాడ : క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.550లుగా నిర్ణయించామని, అధిక ధరలకు ఇసుక అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆయన గురువారంనాడు ఇసుక విధానంపై కేబినేట్ సబ్‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఏడాదికొకసారి ఇసుక రీచ్‌ల వారీగా వేలం నిర్వహిస్తామని వెల్లడించారు.

12/31/2015 - 11:42

విశాఖ: గొలుగొండ మండలం చోద్యం గ్రామం వద్ద గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టి 75 లక్షలు విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఒక వ్యాన్‌ను, రెండు బైక్‌లను సీజ్ చేశారు.

12/31/2015 - 11:42

ఒంగోలు: సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి వద్ద గురువారం ఉదయం ఓ యువకుడు వొంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ఓ యువతితో ప్రేమ విఫలం కావడంవల్లే ఇతను ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు.

12/31/2015 - 11:40

విజయవాడ: వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టేందుకు ఎ.పి.లోని 13 జిల్లాల్లో ఇప్పటివరకు 250 కాల్‌మనీ కేసులు నమోదు చేసినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప గురువారం మీడియాకు చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాగా, పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

12/31/2015 - 11:40

విజయవాడ: ఎ.కొండూరు మండలం మాధవరం సమీపంలో ఓ వ్యవసాయ బావిలో పడి ముగ్గురు గొర్రెల కాపరులు మరణించిన ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. బుధవారం సాయంత్రం దాహం తీర్చుకొనేందుకు వీరు బావి దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయారు. ఐతే రాత్రి వీరు ఇంటికి రాకపోవడంతో గురువారం ఉదయం సమీప ప్రాంతాల్లో బంధువులు గాలించగా బావిలో మూడు మృతదేహాలను గుర్తించారు.

12/31/2015 - 11:37

నెల్లూరు: డక్కిలి మండలం నాగులపాడులో ఓ గృహిణి ఇద్దరు కుమారులతోపాటు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు కారణాలింకా తెలియాల్సి ఉంది.

12/31/2015 - 11:36

విజయవాడ: భవానీ భక్తుల దీక్షల విరమణ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం ఉదయం నుంచి సందడి నెలకొంది. ఇరుముడులు సమర్పించేందుకు వచ్చిన భక్తుల నుంచి కొందరు అర్చకులు డబ్బులు వసూలు చేయడంతో ఘర్షణ ప్రారంభమైంది. అర్చకులను అడ్డుకునేందుకు గురుభవానీలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

12/30/2015 - 16:15

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి నూతన ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రసవం తర్వాత తల్లీ బిడ్డలను ఇంటికి చేర్చేందుకు 102 సేవలు ప్రారంభించనున్నారు.

12/30/2015 - 14:24

విజయవాడ : నీతి ఆయోగ్ బృందం బుధవారంనాడు విజయవాడలో పర్యటించింది. నగర శివారులో జక్కంపూడి వద్ద ఉన్న పట్టిసీమ పనులను పరిశీలించింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగార్య సంతృప్తు వ్యక్తంచేశారు. ఈ బృందం పర్యటనలో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, కలెక్టర్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.

Pages