S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/01/2015 - 17:08

విజయనగరం : భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ఆగ్రహాం వ్యక్తంచేశారు. ఆమె మంగళవారంనాడు సీపీఎం నాయకులతో కలిసి రైతులతో భేటీ అయ్యారు. రైతులకు అండగా ఉంటామని, ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.

12/01/2015 - 13:45

కాకినాడ : అన్నవరం ఆలయ ప్రధాన ద్వారానికి బంగారు తాపడం ఏర్పాటుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి చిన రాజప్ప బంగారు తాపడం ముఖద్వారానికి ప్రారంభోత్సవం చేశారు. బంగారు తాపడంతో ముఖద్వారం భక్తులకు కనువిందు చేస్తోంది.

12/01/2015 - 13:44

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డక్కిలి మండలం కమ్మపల్లి వద్ద ఎఎన్‌ఎం రాజమ్మ వాగులో కొట్టుకుపోయి గల్లంతైంది. కావలిలో 9.5 సెంమీ వర్షపాతం నమోదైంది. పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

12/01/2015 - 13:41

గుంటూరు : జిల్లాలోని వేమూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జన చైతన్య యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు తెదెపా పార్టీ జన చైతన్య యాత్రలను నిర్వహిస్తోంది.

12/01/2015 - 13:40

గుంటూరు : నరసరావుపేట శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ అందరి భాగస్వామ్యంతోనే పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాలు విజయవంతమవుతాయని అన్నారు. ఈ రన్‌లో పాఠశాలు విద్యార్థులు, యువత పాల్గొన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మున్పిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

12/01/2015 - 11:46

నెల్లూరు: భారీ వర్షాల ఫలితంగా నెల్లూరు జిల్లాలో అనేక వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉప్పుటేరులో ఓ వ్యక్తి గల్లంతు కాగా, చిల్లకూరు మండలంలో తిప్పగుంటపాలెం జల దిగ్బంధనంలో చిక్కుకొంది. సోమశిల జలాశయానికి వరద ఉధృతి పెరిగింది.

12/01/2015 - 11:46

తిరుపతి: తిరుమలలో సమాచార,పౌర సంబంధాల విభాగంలో అటెండర్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగి మంగళవారం ఉదయం తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అసిస్టెంట్ డైరెక్టర్ తనను మానసికంగా వేధిస్తున్నందువల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు అటెండర్ రామ్‌ప్రసాద్ పోలీసులకు తెలిపాడు.

12/01/2015 - 11:45

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నిర్వహించే జన చైతన్య యాత్రను ఆ పార్టీ అధ్యక్షుడు, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా వేమూరులో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో కిలోమీటరు మేరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తారు. చైతన్య యాత్రకు పార్టీ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

12/01/2015 - 11:44

చిత్తూరు: బంగాళాఖాతంలో అల్పపీడనం ఫలితంగా చిత్తూరు జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కె.బి.పురం మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సహాయక చర్యలు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది.

12/01/2015 - 11:44

విశాఖ: మాకవరపాలెం మండలం బుచ్చెన్నపాలెం వద్ద మంగళవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న సుమారు 350 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Pages