S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/26/2020 - 06:30

గుంటూరు, జనవరి 25: సంక్షేమ పాలన అందిస్తారన్న ఉద్దేశంతో అధికారం అప్పగిస్తే, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి భస్మాసురుడిగా మారారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్‌బాబులతో కలిసి విలేఖరులతో యనమల మాట్లాడారు.

01/26/2020 - 06:28

విజయవాడ, జనవరి 25: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా అసెంబ్లీల్లో తీర్మానాలు చేసే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆలిండియా తన్‌జీన్ - ఈ - ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్ పాషా తెలిపారు. సీఏఏను అమలు చేసేదిలేదంటూ తొలుత కేరళ అసెంబ్లీ తీర్మానం చేయగా, తర్వాత పంజాబ్ అసెంబ్లీ కూడా తీర్మానం చేసిందన్నారు.

01/26/2020 - 06:28

విజయవాడ, జనవరి 25: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మీదున్న నరసింహస్వామి దేవాలయ గోపురం వెలుపల నిర్లక్ష్యంగా పడి ఉన్న శ్రీ కృష్ణదేవరాయల శాసనం పట్ల విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

01/26/2020 - 06:27

విజయవాడ, జనవరి 25: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారులు, మిల్లర్ల నుండి కాకుండా నేరుగా రైతుల నుంచి మద్దతు ధరకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు డిమాండ్ చేశారు. ఈ క్రాప్‌తో సంబంధం లేకుండా కౌలు రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని కదలించాలని కోరుతూ శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మధు లేఖ రాశారు.

01/26/2020 - 06:26

గుంటూరు (లీగల్), జనవరి 25: రాష్ట్ర హైకోర్టు తరలింపు ప్రకటన నేపథ్యంలో గత రెండు నెలలుగా నిరవధికంగా విధులకు గైర్హాజరవుతున్న న్యాయవాదులు ఈ నెల 28వ తేదీ నుండి తిరిగి విధులకు హాజరయ్యేందుకు సమాయత్తమయ్యారు. ముందుగా ప్రకటించిన మేరకు విధుల బహిష్కరణ ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.

01/26/2020 - 01:19

విశాఖపట్నం, జనవరి 25: విశాఖపట్నం కేంద్రంగా పర్యాటక భవన్ ఏర్పాటు కానుంది. దీనికి రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక చొరవ చూపుతోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కానున్నాయి.

01/26/2020 - 01:17

కర్నూలు: రాష్ట్ర రాజకీయాల్లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. గత ఎన్నికల్లో భారీ ఆధిక్యత అందుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపధ్యంలో ఆ పార్టీలో చేరాలనుకున్న టీడీపీ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులతో ప్రస్తుతానికి పార్టీ ఫిరాయింపులపై పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

01/26/2020 - 01:07

అమరావతి: విద్యుత్ శాఖలో వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ వీ నాగార్జునరెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా ఫిర్యాదుల బాక్స్‌లను వెంటనే ఏర్పాటు చేయాలని శనివారం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

01/26/2020 - 01:04

అమరావతి: రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి జాతీయ పురస్కారం లభించింది. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఉత్తమ ఎన్నికల నిర్వహణ కేటగిరిలో ఆయన ఎంపికయ్యారు.

01/26/2020 - 01:01

విజయవాడ, జనవరి 25: బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలంటే మన హక్కులతో పాటు మనకు రాజ్యాంగం నిర్దేశించిన విధుల గురించి కూడా తెలుసుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 10వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అధికారులకు అవార్డులను అందించారు.

Pages