S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/21/2019 - 22:11

సింహాచలం, జూన్ 21: విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీనృసింహస్వామి దేవస్థానం అధికారుల ప్రణాళికా రాహిత్యం కారణంగా సింహగిరి మెట్ల మార్గం ప్రమాదభరితంగా మారింది.

06/21/2019 - 22:11

అమరావతి, జూన్ 21: బీజేపీలో రాజ్యసభ సభ్యుల విలీనం అనైతికమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే వరకు ఉద్యమించాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం దేశం, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

06/21/2019 - 22:10

అమరావతి, జూన్ 21: జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వివిధ జిల్లాలకు నియమితులైన ఇన్‌చార్జి మంత్రుల వివరాలిలా ఉన్నాయి.

06/21/2019 - 22:10

విజయవాడ, జూన్ 21: ప్రజాస్వామ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పార్టీ మారిన టీడీపీ ఎంపీలపై అనర్హత వేటు వేసి, పదవుల నుండి తొలగించాలని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ కోరారు.

06/21/2019 - 22:08

తిరుపతి, జూన్ 21: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)్ధర్మకర్తల మండలిలో రాజకీయ నాయకులనే కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

06/21/2019 - 22:07

విజయవాడ, జూన్ 21: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికకు వీలుగా ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియ చేపట్టింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 3వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు సిద్ధం చేశారు.

06/21/2019 - 22:07

విజయవాడ, జూన్ 21: రాష్ట్రంలో ఎన్నికల పక్రియ సజావుగా జరిగి కొత్త ప్రభుత్వ పాలన కూడా ఆరంభమైనందున ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో బదిలీ అయిన తహశీల్దార్‌లను తిరిగి వారి జిల్లాలకు పంపించాలని అమరావతి జేఏసీ చైర్మన్, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

06/21/2019 - 22:06

కడప, జూన్ 21: మరో మూడునెలల్లో తెలుగుదేశం పార్టీ దుకాణం మూసుకోవడం ఖాయమని, రాష్ట్ర ప్రజలు దీన్ని చూడబోతున్నారని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు. శుక్రవారం కడపలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అవినీతి, అక్రమాలు వెలుగుచూసి జైలుకు పంపుతారనే భయంతోనే చంద్రబాబు పార్టీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పించారని ఆరోపించారు.

06/21/2019 - 22:05

బళ్లారి, జూన్ 21: కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రైతుల జీవనాడి అయిన తుంగభద్రలో నీరు అడుగంటిపోయింది. దీంతో రైతులు, ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షం జాడలేకపోవడంతో చుక్క నీరు కూడా జలాశయానికి చేరడం లేదు. గత ఏడాది ముందస్తు వర్షాలు కురవడంతో ఇదే సమయానికి జలాశయానికి 25 టీఎంసీలకుపైగా నీరు చేరింది. 7073 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.

06/21/2019 - 04:30

విజయవాడ, జూన్ 20: రాష్ట్రానికి నైరుతి పవనాలు శుక్ర, శనివారాల్లో రానున్నాయి. రుతుపవనాలు కొంత బలహీనంగా కదులుతున్నాయని ఆర్టీజీఎస్ ఆవేర్ నిపుణులు గురువారం తెలిపారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరులో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

Pages