S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/22/2020 - 01:40

అమరావతి: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఈ నెల 22న ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తున్నందున కీలకమైన ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగకుండా తగిన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభి వృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌తో శనివారం చర్చించారు.

03/22/2020 - 01:39

అమరావతి, మార్చి 21: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై రాష్ట్రం అంతటా ప్రజానీకం అ‘టెన్షన్’ అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా కరోనాపై యుద్ధం ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు.

03/22/2020 - 01:36

అమరావతి, మార్చి 21: కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. దీం తో అధికార యంత్రాంగం కదం తొక్కింది. కొద్దిరోజులుగా అధికారులను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కరోనా నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ము ఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాల్లో కంట్రోల్ రూములు,

03/21/2020 - 16:21

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి ఉగాది కానుకగా ఈ నెల 25వ తేదీన శ్రీవారి లడ్డూలు ప్రతి కుటుంబానికి ఉచితంగా అందించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం నిత్యం లక్షల్లో లడ్డూలు తయారు చేసి నిల్వ ఉంచుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల రాకను నిన్న మధ్యాహ్నంతో నిలిపివేసిన విషయం తెలిసిందే.

03/21/2020 - 16:18

విజయవాడ:దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన 'జనతా కర్ప్యూ' పిలుపు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

03/20/2020 - 07:32

గుంటూరు, మార్చి 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఓ వర్గం కుట్ర పన్నుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. గురువారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసిన అనంతరం వారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

03/20/2020 - 07:30

గుంటూరు, మార్చి 19: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో కుట్రదారులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని రాష్ట్రప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివాదాస్పద అంశాలతో కూడిన లేఖను ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ రాయకుంటే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

03/20/2020 - 05:13

విజయనగరం, మార్చి 19: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విజయనగరం జిల్లాకు పాకిందని వదంతులు విన్పిస్తున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన నలుగురు విదేశీయులు పట్టణానికి రావడంతో వారికి వైద్య పరీక్షలు జరిపి ఓ హొటల్‌లో ఉంచినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికా నుంచి చంద్ అనే మరోవ్యక్తి పట్టణానికి వచ్చారు.

03/20/2020 - 05:13

కుప్పం, మార్చి 19: కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో కరోనా రోగిగ్రస్తుడు ఉన్నాడన్న విషయం బయటకు పొక్కడంతో కలకలం చెలరేగింది. తమిళనాడు రాష్ట్రం వానియంబాడి పట్టణానికి చెందిన కరీముల్లా (80) తీవ్ర జ్వరంతో వానియంబాడిలోని ఒక ప్రెవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో మెరుగైన వైద్యంకోసం కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

03/20/2020 - 05:11

విజయవాడ, మార్చి 19: ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న కోవిడ్-19 (కరోనా)కు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశిస్తూ జిల్లా పంచాయతీ అధికారులు కార్యనిర్వహణ అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పీ గిరిజాశంకర్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages