S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/22/2019 - 23:42

గుంటూరు, ఆగస్టు 22: రాజధాని అమరావతి నిర్మాణంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ ముఖ్యనేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశామని, ప్రస్తుతం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు నష్టపోవడంతో పాటు, రాష్ట్ర ప్రతిష్ట సైతం మసకబారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.

08/22/2019 - 23:41

విజయవాడ, ఆగస్టు 22: మహిళా కమిషన్ మగవారికి వ్యతిరేకం కాదని, మహిళలకు సంబంధించిన అంశాలపై మాట్లాడటానికి, పని చేయడానికి ప్రత్యేకించి ప్రభుత్వానికి సహకరించడానికే మహిళా కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.

08/22/2019 - 23:41

విజయవాడ, ఆగస్టు 22: శాసనసభ ఫర్నిచర్ తరలింపు వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సహా అధికారుల ప్రమేయంపై ప్రభుత్వం విచారణ చేయనుందని నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కోడెల వద్ద ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ చాలా విలువైనదన్నారు.

08/22/2019 - 23:40

విజయవాడ, ఆగస్టు 22: మెడికల్ అడ్మిషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన అన్యాయం, అవకతవకలపై తక్షణమే అఖిలపక్షం వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 2019-20 మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి రిజర్వేషన్ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖామంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

08/22/2019 - 23:40

విజయవాడ, ఆగస్టు 22: రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పని చేస్తున్న వీ. గణేష్‌బాబుపై బదిలీ వేటు పడింది. హైదరాబాద్ నుంచి శాసనసభ ఫర్నిచర్ తరలింపు వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉందని ఆరోపణలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆక్టోపస్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పని చేస్తున్న గణేష్‌బాబును గతంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా నియమించారు.

08/22/2019 - 23:37

గుంటూరు, ఆగస్టు 22: రాష్ట్ర విభజన నాటికి ఏపీలో ఒక్క పరిశ్రమ కూడా లేదని, విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో అనేక పరిశ్రమలు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సులభతర వాణిజ్యంలోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామని తెలిపారు.

08/22/2019 - 23:37

విజయవాడ, ఆగస్టు 22: కేంద్ర హోం, ఆర్థిక శాఖల మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ అధికారులు ఆయన ఇంటి గోడదూకి అరెస్ట్ చేయడం అత్యంత గర్హనీయమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసీరెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆక్షేపించారు. చిదంబరం అరెస్ట్ కావడానికి ముందు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పత్రికల వారితో మాట్లాడారన్నారు.

08/22/2019 - 23:36

విజయవాడ, ఆగస్టు 22: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో నాలుగు రోజులు లోకల్ హాలీడేస్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరీక్ష నిర్వహించే పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలకు సెప్టెంబర్ 3, 4, 6, 7 తేదీల్లో లోకల్ హాలిడేగా ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాన్ని ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

08/22/2019 - 13:36

అమరావతి: పోలవరం పనులపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. నవయుగకు హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.

08/22/2019 - 07:38

భీమవరం, ఆగస్టు 21: వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సుజాతరావు నేతృత్వంలో నియమించిన కమిటీ తన నివేదికలో పలు కీలకమైన సూచనలు చేసింది. వాటి అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది.

Pages