S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/15/2018 - 14:01

అమరావతి: రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు సమస్యగా మారాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులను అధిగమిస్తున్నామని, దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

10/15/2018 - 11:53

పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఉప్పాడ రైల్వేగేటు వద్ద గత అర్ధరాత్రి ఓ ద్విచక్రవాహనాన్ని ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

10/15/2018 - 11:52

కర్నూలు: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఆరవ రోజు కాత్యాయని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం హంసవాహనసేవ పుష్పపల్లకిపై శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జు స్వామివారు శ్రీశైలం పురవీధులలో విహారించనున్నారు.

10/15/2018 - 11:45

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆరో రోజైన సోమవారం కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవి అలంకారాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

10/15/2018 - 11:43

విజయవాడ : శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు దుర్గగుడి ఆవరణలో గుండె పోటుతో మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మృతుడు కృష్ణలంకకు చెందిన అనిల్‌గా గుర్తించారు.

10/15/2018 - 02:13

విజయవాడ, అక్టోబర్ 14: శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న తుపాను పునరావాస, సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తికరంగా లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి తుపాను సహాయక చర్యలపై ఆదివారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రతి ఒక్కరిలో సంతృప్తి రావాలన్నారు.

10/15/2018 - 02:12

విజయవాడ (సిటీ), అక్టోబర్ 14: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జనకవాతుకు సంబంధించిన ప్రత్యేక గీతాన్ని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాయలంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన కవాతు ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు.

10/14/2018 - 07:04

రాజమహేంద్రవరం, అక్టోబర్ 13: పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనులు డిసెంబర్‌లో చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్లాంటు నిర్మాణాన్ని నవయుగ సంస్థ చేపట్టింది. ప్రస్తుతం మట్టి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కొండను తొలిచే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో సివిల్ పనులు చేపట్టి పూర్తిచేయనున్నారు.

10/14/2018 - 07:08

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 13: దేశంలో నరేంద్రమోదీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కారెం శివాజీ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రియదర్శిని కళాశాలలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

10/14/2018 - 07:08

విజయవాడ, అక్టోబర్ 13: దేశంలో అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రజలందరూ సంతోషించాల్సిన విషయమని విజయవాడలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు.

Pages