S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/07/2018 - 02:16

తెనాలి, అక్టోబర్ 6: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 155 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, 35 డెంటిస్టు పోస్టుల రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ పీ దుర్గాప్రసాదరావు తెలిపారు. ఈ పోస్టుల భర్టీకి ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు.

10/06/2018 - 06:44

విజయవాడ, అక్టోబర్ 5: గాంధీ జయంతినాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు.

10/06/2018 - 06:43

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 5: పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస (ఆర్‌అండ్‌ఆర్) ప్యాకేజిలో జరిగిన అవకతవకలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)తో విచారణ జరిపిస్తే అవినీతి అక్రమాలు బయటపడి కొంతమంది మంత్రులు రాజీనామాలు తప్పవని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.

10/06/2018 - 06:42

తిరుపతి, అక్టోబర్ 5: ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు ఒకే ఫోన్ నెంబర్ నుంచి ఎక్కువ మందికి టిక్కెట్లు నమోదు చేస్తున్నారని, వచ్చే నెల నుంచి ఒక ఫోన్ నెంబర్ నుండి ఇద్దరికి మాత్రమే నమోదు చేసుకునేలా మార్పులు తీసుకువస్తామని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం జరిగింది.

10/06/2018 - 06:41

రాజమహేంద్రవరం, అక్టోబర్ 5: బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో బాలికలపై అత్యాచారాలు పెరిగాయని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి మహిళలు, ఆడపిల్లలను కాపాడుకోవాలని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలె అన్నారు. బీజేపీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ నేరస్థులను కాపాడుతున్నాయన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఐద్వా రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన ఆమె శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు.

10/06/2018 - 06:39

విజయవాడ, అక్టోబర్ 5: అలసట, నిద్రలేమి కారణంగా వాహనాలను నడుపుతున్నప్పుడు డ్రైవర్లకు లిప్తకాలం పాటు నిద్ర మత్తులో కళ్లు మూతపడటం, వేగంగా వాహనం వెళ్తున్న సమయంలో ఈ నిద్ర అనేక ప్రమాదాలకు దారి తీయడం తెలిసిందే. ఈ తరహా నిద్రతో జరిగే ప్రమాదాల్లో అనేక మంది జీవితాలు తెల్లారి పొతున్నాయి.

10/06/2018 - 06:38

విజయవాడ, అక్టోబర్ 5: నేటి సామాజిక పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురవడంతో అనారోగ్యాల పాలవుతున్నారని ఆయుర్వేద వైద్య విధానాల ద్వారా శాశ్వత ఉపశమనం సాధ్యవౌతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. శుక్రవారం నగరంలోని మొగల్రాజపురంలోని కళ్యాణ మండపంలో ఆయుర్వేద స్టాళ్ల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.

10/06/2018 - 00:06

విజయవాడ, అక్టోబర్ 5: రాష్ట్రంలోని అన్ని నగరాల్లో, మున్సిపాలిటీల్లో పశువులను రోడ్లపైకి విచ్చలవిడిగా వదిలి వేయడం వలన ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ఆయా ప్రాంతాల నుంచి వాటిని బయటకు పంపించేందుకు జిల్లా, రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డులు కృషి చేయాలని మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య సహకారం శాఖల మంత్రి సి ఆదినారాయణ రెడ్డి ఆదేశించారు.

10/06/2018 - 00:06

విజయవాడ(సిటీ), అక్టోబర్ 5: రాజ్యాంగ బద్ద సంస్థలను చేతుల్లో పెట్టుకున్న ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. మోదీ బెదిరింపులకు బయపడే ప్రసక్తే లేదన్న ఆయన కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలన్నారు.

10/06/2018 - 00:05

అమరావతి, అక్టోబర్ 5: విభజన చట్టంలోని హామీల కంటే ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చామని కేంద్ర పెద్దలు చెబుతున్న మాటలు అన్నీ బూటకమని ఏపీ మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఉన్న ప్రకాష్ జావదేకర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages