S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/02/2018 - 01:56

గుంటూరు, జూలై 1: కానిస్టేబుల్ అయినా, ఎస్పీ అయినా తామంతా ఒకటే కుటుంబమని, కుటుంబ పెద్దగా సిబ్బంది సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని ఏపీ నూతన డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. గుంటూరు విద్యానగర్‌లోని పోలీసు క్వార్టర్లను ఆదివారం సందర్శించి పోలీసు కుటుంబాలతో కొద్దిసేపు గడిపారు. క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని, నూతన క్వార్టర్స్ నిర్మించాలని పోలీసు కుటుంబ సభ్యులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

07/02/2018 - 01:54

విజయవాడ, జూలై 1: కడప ఉక్కు కర్మాగారం కోసం చేసిన దీక్షలకు సేకరించిన నిధులు, చేసిన ఖర్చులు, మిగిలిన డబ్బు వివరాలను శే్వతపత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేసింది.

07/02/2018 - 01:50

విజయవాడ, జూలై 1: నెల్లూరులో జరిగిన ‘దళిత తేజం - తెలుగుదేశం’ సభ విపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

07/01/2018 - 23:37

కడప, జూలై 1 : జిల్లాలో త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉక్కు పరిశ్రమ స్థాపనకు శంకుస్థాపన చేయనున్నారని బీజేపీ సీనియర్ నేత కందుల రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కడపలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి వుందని, జిల్లా వాసుల ఉక్కు పరిశ్రమ కోరిక తప్పక నెరవేరుతుందన్నారు. అనివార్య కారణాలు, రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల కాస్త ఆలస్యమైందన్నారు.

07/02/2018 - 01:29

కర్నూలు : రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా మారుతున్న పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పూర్వ వైభవం సాధిస్తామన్న ధీమా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్రంలో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారన్న విశ్వాసం నాయకుల్లో ఉంది.

07/01/2018 - 23:36

గుంటూరు, జూలై 1: ఉద్యోగులు కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దుకోసం రెండేళ్లుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దుచేయాలని కోరుతూ ఆదివారం గుంటూరులో ఉద్యోగులు ఆత్మగౌరవ సభ నిర్వహించారు.

07/01/2018 - 04:55

కాకినాడ, జూన్ 30: పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే యోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం తనను కలసిన విలేఖరులతో యనమల మాట్లాడారు.

07/01/2018 - 02:14

విజయవాడ (క్రైం), జూన్ 30: తాను డీజీపీగా ఉన్నంతకాలం తప్పు చేసిన వారు ఎంతటివారైనా ఏమాత్రం ఉపేక్షించేదీ లేదని నూతన డీజీపీ ఆర్‌పి ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్టల్రో రౌడీయిజం లేకుండా చేస్తానన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ కొనసాగిస్తానన్నారు. పారదర్శకతలో రాజీపడేది లేదని, ఏసీబీ తరహాలో రాష్ట్ర పోలీసుశాఖలోనూ సంస్కరణలు తీసుకొస్తానన్నారు. పోలీసు సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు.

06/30/2018 - 23:53

రాజమహేంద్రవరం, జూన్ 30: బీసీ జనాభా దామాషాపై రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న బీసీ జనాభా తాజా లెక్కలను బహిర్గతం చేయాలని రాష్ట్ర బీసీ సంఘాల సమన్వయ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో బీసీ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బీసీ సంఘాల సమన్వయ సంఘం సమావేశం శనివారం జరిగింది.

06/30/2018 - 23:53

ఒంగోలు, జూన్ 30 : రానున్న 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. శనివారం ఒంగోలులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర అనంతరం ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామని తెలిపారు.

Pages