S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/28/2015 - 07:09

న్యూఢిల్లీ, నవంబర్ 27: అంతర్జాతీయంగా మందగమనం, నానాటికి దేశీయ ఎగుమతులు పడిపోవడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ మార్కెట్లలో భారత ఎగుమతుల బలోపేతానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎగుమతిదారులకు పోటీ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలని సూచించారు.

11/28/2015 - 06:57

న్యూఢిల్లీ, నవంబర్ 27: మరో రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు (సిపిఎస్‌ఇ) మూతపడబోతున్నాయి. అందులో ఒకటి హెచ్‌ఎమ్‌టికి చెందినదైతే, మరొకటి టైర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టిసిఐఎల్). ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న హెచ్‌ఎమ్‌టి బేరింగ్స్, హెచ్‌ఎమ్‌టి వాచెస్, హెచ్‌ఎమ్‌టి చినార్ వాచెస్, తుంగభద్ర స్టీల్ ప్రోడక్ట్స్, హిందుస్థాన్ కేబుల్స్ సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చేసింది.

11/28/2015 - 06:56

హైదరాబాద్, నవంబర్ 27: ఎమ్‌బిఎ విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) తెలంగాణ విభాగం చైర్‌పర్సన్ వనిత దాట్ల అన్నారు. తరగతి గదుల్లో నేర్చుకునే విద్యకు, ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకునే విద్యకు చాలా వ్యత్యాసం ఉంటుందని, ఆ వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించాలన్నారు.

11/28/2015 - 06:55

ముంబయి, నవంబర్ 27: ప్రభుత్వరంగ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ ఉద్యోగులు రోడ్డెక్కారు. బ్యాంకును ప్రైవేటీకరించాలనుకుంటున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం ఒకరోజు సమ్మెను చేపట్టారు. సర్కారు ఆలోచనను వ్యతిరేకిస్తూ 30 వేలకుపైగా ఉన్న బ్యాంక్ సిబ్బంది ప్లకార్డులను ప్రదర్శించారు. యాక్సిస్ బ్యాంక్ మాదిరిగానే ఐడిబిఐ బ్యాంక్‌నూ ప్రైవేటీకరించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.

11/28/2015 - 06:54

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్ మనోజ్ భార్గవ.. శుక్రవారం ఇక్కడ ఓ సరికొత్త సైకిల్‌ను ఆవిష్కరించారు. ఇది విద్యుదుత్పత్తి చేసే సైకిల్ కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఈ సైకిల్ ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా భార్గవ అన్నారు. ‘ఈ సైకిల్ విద్యుదుత్పత్తిని చేస్తుంది. దీని పెడల్స్‌ను తొక్కిన సమయంలో చక్రాలు తిరిగి విద్యుత్ జనిస్తుంది.

11/28/2015 - 06:53

విశాఖపట్నం, నవంబర్ 27: ఎగుమతి, దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్య లోటు దేశంలో భారీగా ఉందని కృష్ణపట్నం పోర్టు డైరెక్టర్ కెప్టెన్ శ్రీరామ్ రవిచందర్ అన్నారు. శుక్రవారం విశాఖ ఎయిర్ ట్రావెర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన రవిచందర్ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ మన దేశం నుంచి ఇప్పుడు జరుగుతున్న ఎగుమతులను 150 శాతం పెంచితే, దిగుమతుల స్థాయికి చేరుకోగలుగుతామన్నారు.

11/28/2015 - 06:52

న్యూఢిల్లీ, నవంబర్ 27: వచ్చే నెల 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఐదో ద్వైపాక్షిక ద్రవ్యసమీక్ష జరగనుంది. దీంతో శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ఇక్కడ ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కలిశారు.

11/28/2015 - 06:52

ముంబయి, నవంబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందుతుందన్న ఆశాభావంతో మదుపరులు పెట్టుబడులపట్ల ఆసక్తి కనబరిచారు. అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా మార్కెట్లు నష్టాల్లో కదలాడినప్పటికీ జిఎస్‌టిపై నెలకొన్న సానుకూల అంచనాలు దేశీయ మార్కెట్లను లాభపరిచాయి.

11/28/2015 - 06:51

ముంబయి, నవంబర్ 27: గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌ఎస్‌బిసి.. భారత్‌లో తమ ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ‘ఇక్కడి (్భరత్) మా గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఓ వ్యూహాత్మక సమీక్ష అనంతరం వీటిని (వ్యాపార కార్యకలాపాలను) నిలిపివేయాలని మేము నిర్ణయించుకున్నాం.’ అని బ్యాంక్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

11/27/2015 - 16:07

ముంబయి :దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 26,128 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 7,942 పాయింట్ల వద్ద ముగిసింది.

Pages