S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/25/2015 - 06:23

న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి మంగళవారం భద్రతాపరంగా మరిన్ని ఫీచర్లతో స్విఫ్ట్, డిజైర్ మోడళ్ళను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం స్విఫ్ట్ ధర 4.9 లక్షల రూపాయల నుంచి 6.43 లక్షల రూపాయలుండగా, డిజైర్ ధర 5.4 లక్షల రూపాయల నుంచి 7.06 లక్షల రూపాయలుగా ఉంది.

11/25/2015 - 06:23

న్యూఢిల్లీ, నవంబర్ 24: రాబోయే రెండేళ్ళలో పవర్ ప్రాజెక్టుల అమ్మకం ద్వారా, మరికొన్ని సంస్థలను స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశ పెట్టడం ద్వారా దాదాపు 6,600 కోట్ల రూపాయల (1 బిలియన్ డాలర్లు) నిధులను అందుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్. సుమారు 35,000 కోట్ల రూపాయల రుణ భారాన్ని మోస్తున్న ఈ సంస్థ రాబోయే నిధులతో ఆ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.

11/24/2015 - 18:05

ముంబయి : స్టాక్ మార్కెట్లు మంగళవారం సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 43 పాయింట్ల నష్టంతో 25వేల 775 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 7వేల 831 పాయింట్ల వద్ద ముగిసింది.

11/24/2015 - 08:10

పూర్తిస్థాయి అధికారాలు, స్వయం ప్రతిపత్తినిస్తున్నాం
ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు జైట్లీ స్పష్టీకరణ
ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నిరర్థక ఆస్తులపై సీరియస్

11/24/2015 - 08:10

ముందుకొచ్చిన లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ * చంద్రబాబుతో భేటీ

11/24/2015 - 08:09

ముంబయి, నవంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణ వైపునకు వెళ్ళడంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 49.15 పాయింట్లు పడిపోయి 25,819.34 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7.30 పాయింట్లు కోల్పోయి 7,849.25 వద్ద నిలిచింది.

11/24/2015 - 08:09

* అడ్డుకున్న రైతులు * అధికారులు, వ్యాపారులతో వాగ్వాదం
* ఉద్రిక్తతల మధ్య ఆగిన వేలం పాటలు

11/24/2015 - 08:08

పెరిగిన టమోటా ధరలపై ఆహార మంత్రి పాశ్వాన్
దక్షిణాది రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం
టమోటా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఉందని స్పష్టీకరణ

11/24/2015 - 08:08

అమల్లోకి సరళమైన విధానాలు * మలేసియా కార్పొరేట్లతో ప్రధాని మోదీ

11/24/2015 - 08:07

న్యూఢిల్లీ, నవంబర్ 23: స్మార్ట్ వాచీల కోసం వాచీల తయారీ దిగ్గజం టైటాన్ కో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌పి సోమవారం చేతులు కలిపాయి. భారత్‌తోపాటు పలు విదేశీ మార్కెట్లలోకి వచ్చే నెలాఖర్లో ఈ స్మార్ట్ వాచీలను తీసుకురానున్నట్లు టైటాన్ కో ఓ ప్రకటనలో తెలిపింది.

Pages