S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/02/2020 - 23:43

ముంబయి, ఫిబ్రవరి 2: కేంద్ర బడ్జెట్ ఈవారం స్టాక్ మార్కెట్లను గణనీయంగాప్రభావితం చేసే అవకాశాలున్నాయి. అలాగే కొత్త ఏడాదిలో తొలి సారిగా మంగళవారం జరుగనున్న ద్వైమాసిక రిజర్వు బ్యాంకు ద్రవ్య వినిమయ సమీక్షా సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సైతం మదుపర్లు ప్రత్యేక దృష్టిని నిలిపారు.

02/02/2020 - 07:04

ముంబయి: భారత స్టాక్ మార్కెట్లు శనివారం కుప్పకూలాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మదుపరులను ఆకట్టుకోలేకపోయింది. బడ్జెట్ తీవ్రంగా ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో సూచీల పతనం కొనసాగింది. లావాదేవీలు ప్రారంభమైన మరుక్షణం నుంచే ఊగిసలాడిన సూచీలు చివరికి నష్టాల్లోనే ముగిశాయి.

02/02/2020 - 01:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వ్యవసాయానికి ఊతం కల్పించే రీతిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రతిపాదనలు చేశారు. 2022 సంవత్సరానికి రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్టు కేంద్రం ఇది వరకే ప్రకటించగా, ఇప్పుడు ఆ దిశగా తొలి అడుగులు వేస్తున్నది. నిర్మలా సీతారామన్ శుక్రవారం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేదిగా ఉంది.

02/02/2020 - 01:13

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఆంధ్రాబ్యాంకు ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు అన్ని బ్యాంకు బ్రాంచీ ల్లో సావరీన్ గోల్డ్ బాండ్లను విక్రయించనున్నట్లు ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ తెలిపారు. పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ నిమిత్తం ఈ నెల 3వ తేదీన సావరీన్ గోల్డ్ బాండ్లు విడుదల చేస్తామన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గ్రాము బంగారం రూ.4070 అని చెప్పారు. వీటిపై రూ.50 వరకు డిస్కౌంట్ ఇస్తామన్నారు.

01/31/2020 - 06:52

ముంబయి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే 2020-2021 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై తీవ్రమైన అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో, గురువారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈవారం లావాదేవీల్లో మొదటి రెండు రోజులూ నష్టాలను చవిచూసిన మార్కెట్లు బుధవారం కోలుకున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం మరోసారి నష్టాల్లోకి జారుకున్నాయి.

01/30/2020 - 23:47

విజయవాడ, జనవరి 30: వేతన సవరణకై దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో సమ్మె చేయనున్నారు. బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ఇప్పటికి 20 సార్లు చర్చలు జరిపామని, అయితే ఉన్నతాధికారులు 13 శాతానికి మించి పెంచేందుకు అంగీకిరంచలేదని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నేతలు వెల్లడించారు.

01/30/2020 - 23:42

విజయవాడ, జనవరి 30: ప్రభుత్వ మద్యం దుకాణాల అద్దెలకు సంబంధించి రివర్స్ టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. తొలుత విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

01/30/2020 - 23:02

కెనడా, మెక్సికో దేశాలతో సరికొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, వైట్ హౌస్ (వాషింగ్టన్)
వద్ద విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా మూడు దేశాలు పరస్పరం లబ్ధి పొందుతాయని ఆయన ప్రకటించారు. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో పురోగవృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు

01/30/2020 - 23:05

తడ/వరదయ్యపాళెం, జనవరి 30: నెల్లూరు - చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఏర్పాటైన శ్రీసిటీలో ప్రముఖ టీవీఎస్ గ్రూపులో భాగమైన చెన్నైకి చెందిన మేజర్ సుందరం ఫాస్ట్‌నర్స్ లిమిటెడ్ పరిశ్రమ నూతన యూనిట్‌లో గురువారం వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. వంద కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ యూనిట్ అధిక ఖచ్చితత్వం కలిగిన ఇంజనీరింగ్ విడిభాగాలు తయారుచేసి ఎగుమతి చేస్తుంది.

01/30/2020 - 05:25

ముంబయి: కేంద్ర బడ్జెట్‌పై ఆశావహ అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు కోలుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్ భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 231.80 పాయింట్లు (0.57 శాతం) లాభపడి 41,198.66 పాయింట్ల ఎగువన స్థిరపడింది. ఐతే ఈ సూచీ ఇంట్రాడేలో ఓ దశలో 41,334.86 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశ లో 41,108.19 పాయింట్ల కనిష్టాన్ని తాకి ఊగిసలాడింది.

Pages