S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/22/2018 - 00:55

హైదరాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే సహించబోమని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. జూపల్లి అధ్యక్షతన శనివారం ఇక్కడ జాతీయ ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం జరిగింది.

07/21/2018 - 23:58

న్యూఢిల్లీ, జూలై 21: వంద రూపాయల డినామినేషన్ గల కొత్త సిరీస్ నోట్లను విడుదల చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) చేసిన ప్రకటన దేశంలోని ఆటోమాటిక్ టెల్లర్ మెషిన్ల (ఏటీఎంల)ను తయారు చేసి, సరఫరా చేసే ప్రధాన కంపెనీలలో ఆందోళన మొదలయింది. దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత విడుదల చేసిన కొత్త రూ. 2,000, రూ. 500, రూ. 200, రూ. 10 డినామినేషన్ల కొత్త నోట్ల వలెనే ఇప్పుడు విడుదల చేయనున్న రూ.

07/21/2018 - 23:57

ఆస్పెన్ (యూఎస్), జూలై 21: అమెరికాతో చైనా వాణిజ్యపరమైన ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నది. అమెరికాను నెట్టేసి, ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకే, యూఎస్‌తో వాణిజ్యపరమైన పోరాటానికి తెరతీసింది. ఈ విషయాలను అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తన నివేదికలో వెల్లడించింది.

07/21/2018 - 23:56

న్యూఢిల్లీ, జూలై 21: చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పెరిగిన ధరల పట్టిక ప్రకారం లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 76.47కు, ముంబయిలో రూ. 83.91కి చేరింది. అలాగే కోల్‌కతాలో రూ. 79.27కు, చెన్నైలో రూ. 79.43కు చేరింది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 68.08కి, ముంబయిలో రూ. 72.28కి, కోల్‌కతాలో రూ.

07/21/2018 - 23:55

ముంబయి, జూలై 21: దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు వారాల లాభాలకు తెరపడింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో స్వల్పంగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 45.26 పాయింట్లు పడిపోయి 36,496.37 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 11,000 పాయింట్ల స్థాయికి పైన నిలదొక్కుకోగలిగింది.

07/21/2018 - 05:13

ముంబయి: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు జూలై 13తో ముగిసిన వారంలో 734.5 మిలియన్ డాలర్లు తగ్గి, 405.075 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గణాంకాలు ఈ విషయం వెల్లడించాయి. అంతకు ముందు వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు 248.20 మిలియన్ డాలర్లు తగ్గి, 405.81 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

07/21/2018 - 00:10

ముంబయి, జూలై 20: ఐటీ, ఫార్మా షేర్లలో వచ్చిన ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 145 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ తిరిగి మానసికంగా కీలకమయిన 11,000 పాయింట్ల స్థాయికన్నా ఎగువన ముగిసింది. మదుపరులు..

07/21/2018 - 00:09

అమరావతి, జూలై 20: కామర్స్, ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు నైపుణ్యతా శిక్షణ ఇచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిసంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసి), నేషనల్ స్టాక్ ఎక్సేంజి అకాడమీ మధ్య ఒప్పందం కుదిరింది.

07/21/2018 - 00:07

న్యూఢిల్లీ, జూలై 20: భారత్ అమెరికాకు చేస్తున్న ఉక్కు ఎగుమతులు చాలా తక్కువని, అందువల్ల అమెరికా ఉక్కు దిగుమతులపై పెంచిన సుంకాల వల్ల భారత పరిశ్రమకు ఇప్పటికిప్పుడే ఎలాంటి ముప్పు వాటిల్లబోదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది.

07/20/2018 - 12:07

ముంబయి: రూపాయి ఈరోజు మరింత పతనం చెందింది. జీవనకాల కనిష్టానికి చేరటం విశేషం. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.69.12కి చేరింది.

Pages