S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/05/2018 - 01:23

దహేజ్ (గుజరాత్): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సమీక్షించే ప్రసక్తే లేదని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. అయితే ఇంధన ధరలు అదుపు చేసే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, దీనికి దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనడంపై దృష్టిపెట్టిందని ఆయన తెలిపారు.

06/05/2018 - 01:15

భారత్ స్టాక్ మార్కెట్లను ఆర్బీఐ సమీక్ష భయం అలముకుంది. ఈ వారంలో రేట్లు పెరిగే అవకాశం ఉంటుందన్న ఆందోళన సోమవారం జరిగిన మార్కెట్ లావాదేవీల్లో స్పష్టంగా కనిపించింది. దాంతో ఇనె్వస్టర్లు కూడా ఆచి తూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ప్రతిబింబిస్తూ సెనె్సక్స్ 215 పాయింట్లు కోల్పోయింది. బ్యాంకులు, వినియోగ వస్తువులు, మూలధన వస్తువులకు చెందిన కంపెనీల షేర్లు 1.83 శాతం మేర విలువను కోల్పోయాయి.

06/05/2018 - 01:16

హైదరాబాద్, జూన్ 4: పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పన్యాల భూపతిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. ఇంతవరకు ఈ పోస్టులో కొనసాగిన పేర్వారం రాములు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో పన్యాల భూపతిరెడ్డిని నియమించినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈయన పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు.

06/05/2018 - 01:19

న్యూఢిల్లీ, జూన్ 4: పునర్వినియోగ ఇంధన రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లివెత్తుతున్నాయి. ముఖ్యంగా చమురు ఇంధన రంగంలో మెరగవుతున్న పరిస్థితులు ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తున్నాయని తాజాగా వెలువడిన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ రంగాల్లో ఉద్యోగాలు వెతుక్కునే వారి సంఖ్య 2014 నుంచి గణనీయంగా పెరిగిందని, దాదాపు 76 శాతం మేర ఈ రంగంలో ఉపాధి అవకాశాల అనే్వషణలు పెరిగినట్టు తెలిపారు.

06/05/2018 - 00:52

న్యూఢిల్లీ, జూన్ 4: భారత్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త చైర్మన్ కోసం అనే్వషణ ప్రారంభించింది. ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న ఎంకె శర్మ పదవీ కాలం ఈ నెల 30తో ముగుస్తుండటంతో ఆయన స్థానంలో చైర్మన్ కోసం బ్యాంక్ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌లుగా ఉన్నవారిని నియమించాలా?

06/04/2018 - 04:09

మదనపల్లె: భానుడి తాపానికి ఎగుమతులతో తగ్గిపోయిన టమోటా ధరలకు మూడురోజులుగా రెక్కలు వచ్చాయి. వారంరోజులుగా అక్కడక్కడా.. రెండురోజులుగా చిరుజల్లులు, వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో టమోటాసాగు కరువు జయిస్తోంది.

06/04/2018 - 03:24

ముంబయి: 2017లో సగటున విమాన చార్జీలు 18 శాతం తగ్గిపోయాయని, ఇదే సమయంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య, 2014 నుంచి 2018 వరకు వార్షికంగా 19 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ‘సాఫ్‌నియత్ సహీ వికాస్’ శీర్షిక కింద ఆయన వరుస ట్వీట్‌లు చేస్తూ, దేశీయంగా విమానాల తయారీకి సంబంధించి బ్లూ ప్రింట్‌ను తమ మంత్రిత్వశాఖ రూపొందిస్తున్నదన్నారు.

06/04/2018 - 01:29

న్యూఢిల్లీ, జూన్ 3: ద్రవ్య విధానానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ తీసుకోబోయే నిర్ణయాలు, ప్రపంచ వాణిజ్య పరిణామాలు, స్థూలార్థిక గణాంకాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా.3రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్ల దృష్టి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, ప్రపంచ వాణిజ్య వివాదాల ఉద్రిక్తతలపై కేంద్రీకృతమయి ఉంటుంది.

06/04/2018 - 01:27

న్యూఢిల్లీ, జూన్ 3: రైతుల ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, విదేశీ నౌకలు వ్యవసాయం, మత్స్యపరిశ్రమ, జంతు ఉత్పత్తులతో భారత తీర ప్రాంతాలకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం లైసెన్స్‌లు జారీ చేస్తుంది. ఇదే సమయంలో భారత పౌరులు ఈ నౌకలను అద్దెకు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని కేంద్ర మతత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

06/04/2018 - 01:25

న్యూఢిల్లీ, జూన్ 3: మేనెల మొత్తం మీద ఫారెన్ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీయ మార్కెట్ నుంచి రూ.29,714 కోట్ల నిధులను విదేశాలకు తరలించారు. గత 18 నెలల కాలంలో విదేశాలకు తరలిన అతిప్దె మొత్తం ఇదే. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. విదేశాలకు తరలిపోయిన నిధుల్లో తర్వాతి స్థానాన్ని మూలధన పెట్టుబడులు (ఈక్విటీ, రుణాలు) ఆక్రమిస్తున్నాయి.

Pages