S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/14/2018 - 00:28

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రాష్ట్ర సుంకాల ఉపశమన పథకాల (రెమిషన్ ఆఫ్ స్టేట్ లెవీస్-ఆర్‌ఓఎస్‌ఎల్) కోసం ఉద్దేశించిన కేటాయింపులను ఈసారి బడ్జెట్‌లో ఏకంగా 39 శాతం మేరకు పెంచడంతో వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఎగుమతులు పెరుగుతాయని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెప్పారు.

02/14/2018 - 00:21

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: వేసవి విద్యుత్ అవసరాలకు సంబంధించి అంచనాలు సిద్ధమవుతున్నాయి. దీనిపై సంస్థ యాజమాన్యం లెక్కలు కడుతోంది.

02/14/2018 - 00:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రపంచంలో సాంకేతిక సన్నద్ధత, మానవ-సాంకేతిక అనుసంధానం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో భారత్‌కు చెందిన సంస్థలు ముందంజలో ఉన్నాయని ఓ సర్వే స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలైన సింగపూర్, ఆస్ట్రేలియాలను కాదని భారత్ ఈ విషయంలో దూసుకుపోతోందని, దేశంలోని 38 శాతం సంస్థలు ఇప్పటికే ఈ విధానాలను అమలు చేశాయని ఆ సర్వేలో తేలింది.

02/14/2018 - 00:19

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: హార్లే డేవిడ్సన్, ట్రియంఫ్ వంటి అత్యున్నత, సంపన్న శ్రేణికి చెందిన మోటార్‌బైక్‌ల ధరలు తగ్గనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఖరీదైన మోటార్‌సైకిళ్లపై విధించిన దిగుమతి సుంకం భారీగా తగ్గడంతో ఇది సాధ్యం కానుంది.

02/14/2018 - 00:17

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో జరుగుతున్న బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో భారత ఫార్మా రంగాన్ని నియత్రించే విధంగా అమెరికా, ఐరోపా మార్కెట్ల విధానాలను సమీక్షించనున్నారు. దీని వల్ల ఫార్మా రంగం నష్టాలను ఎదుర్కొంట్నున్న అంశాలపై చర్చించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ లైఫ్ సైనె్సస్ సిఇవో శక్తినాగప్పన్ తెలిపారు. బయో ఆసియా, డెలాయిట్ సంస్థలు భారత్ ఫార్మా కంపెనీలపై అధ్యయనం చేశాయి.

02/13/2018 - 02:50

ముంబయి, ఫిబ్రవరి 12: ప్రపంచ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొనడంతో పాటు ఇటీవల ధరలు పడిపోయిన విలువయిన షేర్లను మదుపరులు కొనుగోలు చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు సోమవారం బాగా పుంజుకున్నాయి. వరుసగా రెండు వారాల పాటు పడిపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు గత పది సెషన్లలో పుంజుకోవడం ఇది రెండోసారి.

02/13/2018 - 02:38

విజయవాడ, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో ప్రజల నుండి జన్మభూమి, ఇతర సందర్భాల్లో వచ్చిన ఆర్థికేతర ఫిర్యాదులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారం, ముఖ్యమంత్రి హామీల అమలుపై సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

02/13/2018 - 02:36

విజయవాడ, ఫిబ్రవరి 12: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ 12,910 కోట్ల రూపాయలు ఖర్చుచేసి 53శాతం పనులను పూర్తిచేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంధించిన ప్రశ్నలకు పరోక్షంగా మంత్రి బదులిచ్చారు.

02/13/2018 - 02:35

విజయనగరం, ఫిబ్రవరి 12: ప్రపంచ విమానయాన రంగంలో భారత్ మూడో స్థానంలో ఉందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. సోమవారం ఆయన పట్టణంలో నూతనంగా నిర్మించిన అవినీతి నిరోధక శాఖ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు భారత్ విమానయాన రంగంలో అట్టడుగు స్థానంలో ఉండేదన్నారు.

02/12/2018 - 22:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి పెరుతుందని, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం తగ్గడంతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సమీప భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం స్వల్పంగా ఉందని ఒక తాజా నివేదిక వెల్లడించింది.

Pages