S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/07/2017 - 01:01

తిరుపతి, అక్టోబర్ 6: వ్యవసాయాధారిత నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమల స్థాపనతో సన్‌రైజ్ స్టేట్‌గా రూపకల్పన చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ధ్యేయమని రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి వెల్లడించారు.

10/07/2017 - 00:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలో బ్యాంకులను ఏకీకృతం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ బ్యాంకు (పిఎస్‌బి)ల సంఖ్యను 10 నుంచి 15 వరకు కుదించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖకు ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న సంజీవ్ సన్యాల్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వానికి మెజార్టీ వాటాలు ఉన్న బ్యాంకులు 21 ఉన్నాయి.

10/07/2017 - 00:58

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశ జౌళి రంగంలోకి గత రెండేళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) మూడు రెట్లు పెరిగాయని, దీంతో ఈ రంగం పట్ల విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం మరింత బలపడిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.

10/07/2017 - 00:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా శుక్రవారం తమ ప్రీమియమ్ ఎస్‌యువి ‘టక్సన్’ను 4-వీల్ డ్రైవ్ (4డబ్ల్యుడి) సిస్టమ్‌తో మార్కెట్లో ప్రవేశపెట్టింది. టాప్ ఎండ్‌లోని డీజిల్ వేరియంట్‌లో మాత్రమే 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని, న్యూఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.25.19 లక్షలుగా నిర్ణయించామని ఆ సంస్థ వెల్లడించింది.

10/07/2017 - 00:55

సత్యవేడు, అక్టోబర్ 6: ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి)కు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రీన్‌సిటీ గోల్డ్ రేటింగ్ అవార్డు’ శ్రీసిటీకి దక్కింది. దేశంలో ఈ అవార్డు పొందిన అతికొద్ది గ్రీన్ నగరాల జాబితాలో శ్రీసిటీ చేరింది.

10/07/2017 - 00:53

హైదరాబాద్, అక్టోబర్ 6: అధీకృత గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సువిధ ప్రొవైడర్స్ (జిఎస్‌పి)లో ఒకటైన టాక్స్‌మాన్ శుక్రవారం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కార్పొరేట్స్, ఎస్‌ఎంఈలు తమ జిఎస్‌టి కాంప్లియెన్స్ నిర్వహించేందుకు వీలుగా టాక్స్‌మాన్ బిఎస్‌ఎన్‌ఎల్ ఒన్ సొల్యూషన్ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరిస్తున్నట్లు టాక్స్‌మాన్ డిజిఎం ఆదిత్య సింఘానియా తెలిపారు.

10/07/2017 - 00:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలో మద్యంపై నిషేధం మరింత విస్తరిస్తే అది దేశ పర్యాటక పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సిఇఓ) అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. దేశంలోకి వచ్చే పర్యాటకులు ఏం తినాలి? ఏం తాగాలి? అనేది నిర్ణయించే పని రాష్ట్ర ప్రభుత్వాలది కాదని ఆయన అన్నారు.

10/06/2017 - 01:00

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశంలోని అత్యంత సంపన్నవంతులైన వ్యక్తుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ వరుసగా పదో ఏడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన నికర సంపద 38 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.5 లక్షల కోట్లకు) పెరగడమే ఇందుకు కారణం.

10/06/2017 - 00:58

ముంబయి, అక్టోబర్ 5: గత నాలుగు రోజులుగా వరుసగా పుంజుకుంటూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తాజా పరిణామాల నేపథ్యంలో నష్టాలను చవిచూశాయి. వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ అంతిమంగా 79.68 పాయింట్లు కోల్పోయి 31,592.03 వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో విదేశీ పెట్టుబడులు తరలిపోవడంపై ఇనె్వస్టర్లలో ఆందోళన నెలకొంది.

10/06/2017 - 00:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఈ ఏడాది భారత్‌లోని అత్యంత సంపన్నులైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఓపి జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రీ జిందాల్, బయోటెక్నాలజీ దిగ్గజం కిరణ్ మజుందార్ షా సహా ఏడుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు.

Pages