S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/30/2017 - 00:13

హైదరాబాద్, ఆగస్టు 29: ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ బ్లూస్టార్.. మార్కెట్‌లోకి సరికొత్త వాటర్ ప్యూరిఫయర్లను తీసుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో సంస్థ ప్రతినిధులు వీటిని విడుదల చేశారు. 21 రకాల మోడల్స్‌ను పరిచయం చేయగా, వీటి ధరల శ్రేణి కనిష్టంగా 7,900 రూపాయలు, గరిష్ఠంగా 44,900 రూపాయలుగా ఉంది.

08/29/2017 - 00:45

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్‌టిపిసిలో 5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోంది. రెండు రోజుల ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా ఈ వాటాల విక్రయం జరగనుండగా, 7,000 కోట్ల రూపాయల నిధులను మోదీ సర్కారు సమీకరించనుంది. మంగళ, బుధవారాల్లో ఒఎఫ్‌ఎస్ జరుగుతుంది. ఒక్కో షేర్‌ను 168 రూపాయల చొప్పున అమ్మనున్నామని ఓ అధికారి సోమవారం తెలిపారు.

08/29/2017 - 00:44

న్యూఢిల్లీ, ఆగస్టు 28: మరిన్ని కొత్త సెక్యురిటీ ఫీచర్లతో రిజర్వ్ బ్యాంకు త్వరలోనే 1,000 రూపాయల నోటును చలామణిలోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలనలో భాగంగా నిరుడు నవంబర్‌లో పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేసినది తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా 2,000, 500 రూపాయల నోట్లను తీసుకురాగా, వీటి మధ్య మరో కరెన్సీ ఏదీ లేకపోవడంతో చిల్లర సమస్యలు తలెత్తుతు న్నాయ. దీంతో రూ.

08/29/2017 - 00:43

హైదరాబాద్, ఆగస్టు 28: ఉద్యోగ భవిష్య నిధి ఇపిఎఫ్‌ఒ.. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో దాదాపు 3,000 కోట్ల రూపాయలను ఎఎప్లస్ కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అలాగే ఎఎఎమైనస్ కార్పొరేట్ బాండ్లలో ప్రస్తుత 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తగ్గించుకోవాలని కూడా నిర్ణయించిందని ఆయన పిటిఐకి చెప్పారు.

08/29/2017 - 00:42

బెంగళూరు, ఆగస్టు 28: ఇన్ఫోసిస్ షేర్ బైబ్యాక్ ఆఫర్‌లో ఆ సంస్థ ప్రమోటర్లూ (వ్యవస్థాపకులు) పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 13,000 కోట్ల రూపాయల షేర్లను భాగస్వాముల నుంచి ఇన్ఫోసిస్ తిరిగి కొనుగోలు చేస్తున్నది తెలిసిందే. ఒక్కో షేర్‌ను 1,150 రూపాయల చొప్పున మొత్తం 11.3 కోట్ల షేర్లను కొనాలని చూస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుత ధర 941.15 రూపాయలే.

08/29/2017 - 00:41

తిరుపతి, ఆగస్టు 28: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో 2.5 శాతం వడ్డీకి 2,780 కిలోల బంగారాన్ని దీర్ఘకాలిక ప్రాతిపదికన 12 సంవత్సరాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) డిపాజిట్ చేసింది. సోమవారం ఎస్‌బిఐ అధికారులు ఈ మేరకు డిపాజిట్ పత్రాలను స్థానిక టిటిడి పరిపాలనా భవనంలో టిటిడి ఎఫ్‌ఏఅండ్‌సిఏఓ ఓ బాలాజీకి అందించారు.

08/29/2017 - 00:39

రాజమహేంద్రవరం, ఆగస్టు 28: గ్యాస్ పైపులైన్ల లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వ రంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి.. అత్యాధునిక టెక్నాలజీని ఆశ్రయించింది. కృష్ణా- గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో తరచూ చోటుచేసుకుంటున్న పైపులైన్ లీకేజీల నేపథ్యంలో స్థానికంగా ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

08/29/2017 - 00:37

ముంబయి, ఆగస్టు 28: భారత్-చైనా సరిహద్దు ఆందోళనలు సద్దుమణిగిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 154.76 పాయింట్లు పెరిగి 31,750.82 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 55.75 పాయింట్లు అందుకుని 9,912.80 వద్ద నిలిచింది.

08/29/2017 - 00:37

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఆదాయ పన్ను శాఖ.. 2 లక్షల రూపాయలు అంతకుమించి నగదు లావాదేవీలపై సోమవారం ప్రజలను హెచ్చరించింది. ఒకరోజులో ఒకే వ్యక్తి నుంచి ఈ పరిమితికి మించి లావాదేవీలు అంగీకరించినా, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిపినా జరిమానాలు ఖాయమని స్పష్టం చేసింది.

08/29/2017 - 00:36

నిజామాబాద్, ఆగస్టు 28: తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో పసుపు పంట సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో సరైన ప్రోత్సాహం అందక ఈ పంటను సాగుచేసే రైతులు నీరసించిపోతున్నారు. ఓ వైపు మద్దతు ధర అందక, మరోవైపు పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయని పరిస్థితుల్లో కనీసం పసుపు ఆధారిత పరిశ్రమలైనా ఏర్పడితే తమకు ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుందని ఆశించిన స్థానిక రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది.

Pages